సైబర్ మోసగాళ్లతో జాగ్రత్తగా ఉండాలి  -ఎస్.బి.ఐ ఉద్యోగుల అవగాహన_ 

On
సైబర్ మోసగాళ్లతో జాగ్రత్తగా ఉండాలి  -ఎస్.బి.ఐ ఉద్యోగుల అవగాహన_ 

సైబర్ మోసగాళ్లతో జాగ్రత్తగా ఉండాలి
 -ఎస్.బి.ఐ ఉద్యోగుల అవగాహన_ 

జగిత్యాల, నవంబర్ 25:

సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన కొద్ది సైబర్ నేరగాళ్ళు సరికొత్త రీతిలో ప్రజలను మోసగిస్తున్నారని అవగాహనతోనే సైబర్ మోసాల నుంచి తప్పించుకోవచ్చని ఎస్. బి. హెచ్ క్యాష్ ఆఫీసర్ నలువాల గంగాధర్ అన్నారు. ఆదివారం జగిత్యాల మినీ స్టేడియంలో స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా జాతీయశాఖ ఆదేశాల మేరకు ప్రజలకు కరపత్రాలతో అవగాహనా కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్బంగా గంగాధర్ మాట్లాడుతూ సైబర్ నేరాలపై అవగాహనా పెంచడంతోనే సైబర్ నేరాల నిర్ములన సాధ్యమవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కరపత్రాల్లో సైబర్ నేరగాళ్ళ నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించడం జరిగిందన్నారు. వీటిపై అవగాహన పెంచుకొంటే సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో పడకుండా మనల్ని మనం కాపాడుకోని, మన డబ్బులను మనం కాపాడుకోవచ్చన్ని గంగాధర్ సూచించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఉద్యోగులు గంగాధర్, కృష్ణ, సంతోష్ తోపాటు వాకర్స్ ఉన్నారు.

Tags