జగిత్యాలలో అంగరంగ వైభవంగా నవదుర్గా అమ్మవారి శోభా యాత్ర
జగిత్యాలలో అంగరంగ వైభవంగా నవదుర్గా అమ్మవారి శోభా యాత్ర
మంగళహారతులతో స్వాగతం పలికిన మహిళలు
ఆకట్టుకున్న చిన్నారుల వేషధారణ.. నృత్య ప్రదర్శన
జగిత్యాల అక్టోబర్ 03:
దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పట్టణంలో అంగరంగ వైభవంగా జిల్లా కేంద్రంలోని టాకా సంధి నుండి డప్పుచప్పులు, చిన్నారుల వేషధారణలతో అమ్మవారి శోభాయాత్ర ప్రారంభమై స్థానిక తహసీల్ చౌరస్తా నుండి, రాం బజార్, కొత్త బస్టాండ్, మీదుగా గోవిందు పల్లి నవదుర్గా పీఠ క్షేత్రం వరకు శోభాయాత్ర నిర్వహించారు. చిన్నారులతో వివిధ వేషధారణ, మహిళలు మంగళహారతులతో, విద్యార్థులు కోలాటాలు ఆడుతూ నృత్యాలు సందడి చేశారు. బతుకమ్మ పాటలతో చిన్నారులు, మహిళలు పెద్ద సంఖ్యలో భక్తిశ్రద్ధలతో భవాని దీక్షపరుల మధ్యన అంగరంగ వైభవంగా శోభాయాత్ర నిర్వహించారు.
అనంతరం దేవాలయంలో నవరాత్రోత్సవాలను వేద బ్రాహ్మణుల మంత్రోత్సరణల మధ్య కలశ స్థాపన ప్రత్యేక పూజ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో నవ దుర్గా సేవా సమితి సభ్యులు, అర్చకులు, భక్తులు, నిర్వాహకులు పాల్గొన్నారు.