పార్శీగుట్టలో తల్లి, కొడుకుల ఆత్మహత్య
పార్శీగుట్టలో తల్లి, కొడుకుల ఆత్మహత్య
* అప్పుల బాధనే కారణమన్న పోలీసులు
సికింద్రాబాద్, సెప్టెంబర్ 28 ( ప్రజామంటలు ) :
వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పార్శీగుట్టలో విషాదం చోటు చేసుకుంది. వారాసిగూడ ఎస్.ఐ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం..శనివారం సాయంత్రం డయల్100 కు వచ్చిన కాల్ ఆధారంగా పార్శీగుట్ట న్యూ అశోక్ నగర్ కు వెళ్ళిన పోలీసులకు ఓ ఇంట్లో రెండు శవాలు కనిపించాయి. నాంపరి జయలక్ష్మీ (63), నాంపరి రవికాంత్ (36) లుగా గుర్తించారు. తల్లి, కొడుకులైన వీరు అప్పుల బాధ భరించలేకనే ఆత్మహత్యకు ఒడిగట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. మోనోసిల్ అనే పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నారు. కుమారుడు రవికాంత్ ప్రైవేట్ జాబ్ చేస్తుండగా, ఇతడికి ఇంకా వివాహం కాలేదని, తల్లి జయలక్ష్మీ ఇంటి వద్దనే ఉండేదని స్థానికులు తెలిపారు. ఈరోజు మద్యాహ్నం ఇంటి ఒనర్ కు అనుమానం వచ్చి వీరి గది తలుపుకొట్టగా, తీయకపోవడంతో అనుమానం వచ్చి డయల్ 100 కు కాల్ చేశాడు. పోలీసులు వచ్చి చూడగా ఈ ఘోరం వెలుగు చూసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
–––––––––––––––
–ఫొటో: : విగత జీవులుగా పడి ఉన్న తల్లి, కొడుకులు
––––––