వరల్డ్ టూరిజం సెలబ్రేషన్లో జిల్లాకు తృతీయ బహుమతి - జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

On
వరల్డ్ టూరిజం సెలబ్రేషన్లో జిల్లాకు తృతీయ బహుమతి - జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వరల్డ్ టూరిజం సెలబ్రేషన్లో జిల్లాకు తృతీయ బహుమతి - జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్.                                                                      జగిత్యాల సెప్టెంబర్ 27 (ప్రజా మంటలు)  :   

 ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్బంగా మంత్రి జూపల్లి కృష్ణా రావు చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, జిల్లాకు రాష్ట్ర స్థాయిలో వచ్చిన తృతీయ బహుమతి తో పాటు లక్ష రూపాయల నగదు అందుకున్నారు.IMG-20240927-WA0861

హైదరాబాద్  గచ్చిబౌలి లో రాష్ట్ర  టూరిజం శాఖ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవం - 2024కార్యక్రమంలో కలెక్టర్ ఈ  బహుమతి ని అందుకున్నారు.

పర్యాటకం, సంస్కృతీ సంప్రదాయాలు, వార సత్వ సందపపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే   కాకుండా భవిష్యత్తులో పర్యాటకం వల్ల కలిగే లాభాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, పర్యాటక అనుబంధ రంగాల అభివృద్ధి తదితర అంశాలపై చిన్నప్పటి నుంచే పెంచుకునే అవకాశం యువ క్లబ్బుల ద్వారా విద్యార్థులకు కల్పించి
అవగాహన టూరిజం నందుకు గాను జిల్లాకు ఈ పురస్కారం దక్కింది. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ. జగిత్యాల జిల్లాకు గవర్నమెంట్ ఆదేశానుసారంగా సుమారుగా 300 క్లబ్బులు ఫార్మ్ చేయడం జరిగిందని, ఇందులో అన్ని ఆక్టివిటీస్ సుమారుగా మన జిల్లాలో జగిత్యాల ఫోర్ట్ అనేది ఇద్దరు ఇంగ్లీష్ ఇంజనీర్ల ద్వారా డిజైన్ చేసిన ఫోర్ట్ అని,జగిత్యాల జిల్లాకు పేరు జగిత్యాలని అందుకనే వచ్చిందని తెలిపారు.

మనలో మనం అవేర్నెస్ అనేది మనకు తక్కువగా ఉంటుంది.అయితే ఆ పేరు అనేది చాలామందికి తెలియదు అవేర్నెస్ క్రియేట్ చేసుకొని జిల్లాలో క్లబ్బులని ఇంకా ఏర్పాటు చేసుకొని డెవలప్మెంట్ చేస్తామని అలాగే కొండగట్టు, కోటిలింగాలు 8 జిల్లాలు ఎనిమిది మండలాల్లో కలుపుకొని గోదావరి నది, బీర్పూర్ మండల్ లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపడుతున్న రోల్లా వాగు ప్రాజెక్టు కానీ, అన్ని ప్రాజెక్టుల్లో మనకు టూరిజం పుష్కలంగా ఉన్నాయి. మా స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో పూర్తిగా అవేర్నెస్ కల్పిస్తూ టూరిజాన్ని ఎంకరేజ్ చేయడానికి కృషి చేస్తామని తెలిపారు అనంతరం రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకారం అందజేయాలని కోరారు.

Tags

Latest Posts

ధ్యానం, యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం. - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
ఐఎమ్ఏ , రోటరీ క్లబ్, ఆపి ఆధ్వర్యంలో ఒమేగా సుశృత హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ -పాల్గొన్న DMHO .
తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్
జిల్లా సివిల్ జడ్జి మరియు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రెటరీ కే. ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ దివ్యాంగుల పట్టభద్రుల సంఘం నాయకులు
ప్రపంచ గణిత మేధావి రామానుజన్‌. - జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్.