ఎస్ కే ఎన్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల యువ టూరిజం క్లబ్ వారిచే ర్యాలీ క్షేత్ర పర్యటన.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల సెప్టెంబర్ 27 (ప్రజా మంటలు) :
ఎస్ కే ఎన్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల యువ టూరిజం క్లబ్ సభ్యులు శుక్రవారం ఉదయం పట్టణంలో ర్యాలీ నిర్వహించి పొలాస పౌలస్తీశ్వర ఆలయానికి క్షేత్ర పర్యటనగా వెళ్లారు.
కార్యక్రమం సమన్వయకర్త సాయి మధుకర్ మాట్లాడుతూ.... పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో యువ టూరిజం క్లబ్ పై ఆసక్తి అవగాహన మరియు బాధ్యత సృష్టించే లక్ష్యంతో యువతలో దేశం యొక్క సహజ మరియు సాంస్కృతిక వారసత్వ సంపద అయిన పర్యాటకం పట్ల ఆసక్తి మరియు అభిరుచిని పెంపొందించి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా యువతను ప్రోత్సహించి యువ టూరిజం క్లబ్ లలో యువతను పాల్గొనేలా చేయడం ద్వారా యువతలో టీం వర్క్, నిర్వహణ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తాయని దీనిలో భాగంగా ర్యాలీ నిర్వహించి పొలాస ఆలయానికి క్షేత్ర పర్యటనగా వెళ్లినట్లు తెలిపారు.
అంతకు ముందు ర్యాలీని కళాశాల ప్రిన్సిపల్ అరిగెల అశోక్ ప్రారంభించారు.
కార్యక్రమంలో అధ్యాపక బృందం శ్రీనివాస్, సురేందర్, కవిత, రామచంద్రం, యువ టూరిజం క్లబ్ విద్యార్థులు పాల్గొన్నారు.