ప్రజావాణి లో సమస్యల వెల్లువ అందిన అర్జీలు 365 - చిన్నారెడ్డి ప్రత్యేక చొరవతో అర్జీలకు మోక్షం
ప్రజావాణి లో సమస్యల వెల్లువ అందిన అర్జీలు 365
తక్షణంగా పరిష్కారమైన అర్జీలు 63
మిగతా అర్జీలు పోర్టల్ ద్వారా వివిధ శాఖలకు
సీఎం ప్రజావాణి ఇంచార్జీ చిన్నారెడ్డి ప్రత్యేక చొరవతో అర్జీలకు మోక్షం
హైదరాబాద్ సెప్టెంబర్ 27:
మహాత్మ జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి సమస్యలు వెల్లువెత్తాయని, గత పది సంవత్సరాలుగా సమస్యలు విన్నవించేందుకు వేదిక లేకుండా ఇబ్బందులు పడ్డ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజావాణి ద్వారా కల్పించిన సమస్యల పరిష్కార వేదిక అండగా నిలుస్తోందిని ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ ప్రజావాణి ఇన్చార్జి డాక్టర్ జి చిన్నారెడ్డి అన్నారు.
వివిధ అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ప్రజా భవన్ కు చేరుకొని తమ అర్జీలను అందజేశారు. అర్జీదారుల నుంచి రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ ప్రజావాణి ఇన్చార్జి డాక్టర్ జి చిన్నారెడ్డి వినతులు స్వీకరించి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. మరి కొన్ని సమస్యల తక్షణ పరిష్కారం కోసం పలువురు అధికారులకు ఫోన్ చేసి సమస్యలను పరిష్కరించారు.
శుక్రవారం ప్రజావాణిలో మొత్తం 365 అర్జీలు రాగా అందులో 63 సమస్యలు తక్షణం పరిష్కారం అయ్యాయి. మిగతా అర్జీలు సీఎం ప్రజావాణి పోర్టల్ ద్వారా సంబంధిత శాఖల అధికారులకు పంపారు.
365 అర్జీలలో రెవెన్యూ శాఖకు చెందిన 105 అర్జీలు, విద్యుత్ శాఖ 58, ఎస్సి వెల్ఫేర్ డెవలప్మెంట్ 42, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ 29, మైనారిటీ శాఖకు చెందిన 26, అర్జీలు, ప్రవాసీ ప్రజావాణికి 22 అర్జీలు, ఇతర శాఖల చెందిన 83 అర్జీలు ప్రజావాణిలో అందాయి.
ప్రజావాణి స్టేట్ మోడల్ అధికారి దివ్య, వివిధ శాఖల నోడల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.