కోరుట్లలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
On
కోరుట్లలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
కోరుట్ల సెప్టెంబర్ 27:-
ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి సందర్భంగా కోరుట్ల పట్టణంలో ఏర్పాటుచేసిన జయంతి వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొని బాపూజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్.
ఈ సందర్భంగా డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర పోరాటం మరియు తెలంగాణ తొలి దశ మలిదశ ఉద్యమాలలో పోరాడిన మహనీయుడని వారి ఆశయాల సాధనలో భాగంగా ప్రతి ఒక్కరు వారంలో ఒకసారి చేనేత వస్త్రాలను ధరించి చేనేత రంగానికి తోడ్పాటు అందించాలని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో వారితోపాటు బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, యూత్ నాయకులు పద్మశాలి నాయకులు రుద్ర శ్రీనివాస్,గుంటుక ప్రసాద్, గడ్డం మధు తదితరులు పాల్గొన్నారు.
Tags