జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ఘనంగా గణేశ నవరాత్రి ఉత్సవాలు.

On
జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ఘనంగా గణేశ నవరాత్రి ఉత్సవాలు.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల సెప్టెంబర్ 8 (ప్రజా మంటలు) : 

గణేశ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ నూతన భవనంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు రెండవ రోజు ఘనంగా కొనసాగాయి.

ప్రెస్ క్లబ్ మిత్రులు ఉదయము సాయంత్రం రెండు పూటలా మృత్తిక గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా విశేష భోగాలు స్వామి వారికి నివేదించారు .కార్యక్రమం అనంతరం చేసిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణతో పాటు ఆశీర్వచనం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు.

Tags