నేలకొరిగిన తెలంగాణ సాహితీ కెరటం సినీ గేయ రచయిత "వడ్డేపల్లి కృష్ణ' ఇక లేరు..!
On
నేలకొరిగిన తెలంగాణ సాహితీ కెరటం
సినీ గేయ రచయిత "వడ్డేపల్లి కృష్ణ' ఇక లేరు..!
హైదారాబాద్ సెప్టెంబర్ 06:
ప్రముఖ రచయిత, దర్శకుడు, సినీ గేయ రచయిత వడ్డేపల్లి కృష్ణ ఇక లేరు.రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో చేనేత కుటుంబం నుంచి ఏది గోచ్చిన వడ్డేపల్లి కృష్ణ శుక్రవారం, సెప్టెంబర్ 6న, తెల్లవారుజాము తుది శ్వాస విడిచారు.
అమెరికా "తానా" లాంటి గొప్ప సంస్థలకు ప్రార్థనా గీతాలు, దాదాపు 25 వరకు, 250 వరకు సినీగీతాలు రాశారు.
లలితగీత రచయితగా, వడ్డేపల్లి కృష్ణ ప్రామాణిక పరిశోధకుడిగా, టెలివిజన్ ధారావాహికల దర్శకుడిగా, గీత రచయితగా, వివిధ డాక్యుమెంటరీల రూపకర్తగా, అనేక పుస్తకాలతో పాటు, ఆడియో ఆల్బమ్ ల రూపకర్తగా, సంగీత, నృత్య రూపకాల రచయితగా, వివిధ నాటక రచయితగా, విభిన్న కోణాల్లో తన రచనా నైపుణ్యం తో సాహిత్య సేవలు అందించారు. మానేరు గడ్డమీద నుంచి ఎదిగోచ్చిన వడ్డేపల్లి కృష్ణ కు ఘనమైన నివాళి...
Tags