పుస్తక పఠనంతోనే విషయ పరిజ్ఞానం..

చిన్న వయస్సు లోనే లైబ్రరీ ల ఏర్పాటు అభినందనీయం   * ఆకర్షణ 18వ లైబ్రరీని ఓపెన్​ చేసిన రాష్ర్ట గవర్నర్​

On
పుస్తక పఠనంతోనే విషయ పరిజ్ఞానం..

పుస్తక పఠనంతోనే విషయ పరిజ్ఞానం...
  *  చిన్న వయస్సు లోనే లైబ్రరీ ల ఏర్పాటు అభినందనీయం
  * ఆకర్షణ 18వ లైబ్రరీని ఓపెన్​ చేసిన రాష్ర్ట గవర్నర్

సికింద్రాబాద్​ నవంబర్​ 27 (ప్రజామంటలు) :

కేవలం 13 ఏండ్ల వయస్సులో 8వ తరగతి చదువుతున్న ఆకర్షణ అనే స్టూడెంట్​ వరసగా అనాధ ఆశ్రమాలు, పాఠశాలల్లో లైబ్రరీలను ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ర్ట గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ అన్నారు. బుధవారం మూసాపేట లోని సాయి సేవా సంఘం అనాధ పిల్లల ఆశ్రమంలో ఆకర్షణ ఏర్పాటు చేసిన 18వ లైబ్రరీని గవర్నర్​ ప్రారంభించారు. ఈసందర్బంగా పలు పుస్తకాలను విద్యార్థులకు అందచేశారు. పాకెట్​ మనీతో పాటు తాను సేకరించిన పుస్తకాలతో లైబ్రరీలు ఏర్పాటు చేస్తున్న ఆకర్షన నేటి తరం స్టూడెంట్స్​ కు ఆదర్శనీయమన్నారు. త్వరలో సిటీలోని మెట్రో రైల్వే స్టేషన్​ లో కూడ ఓపెన్​ లైబ్రరీలను ఏర్పాటు చేయనున్నట్లు, ఈ మేరకు ఎల్​ ఆండ్​ టీ అధికారులతో ఒప్పందం కూడ చేసుకున్నామని  స్టూడెంట్​ ఆకర్షణ తెలిపారు.

బేగంపేట లోని హైదరాబాద్​ పబ్లిక్​ స్కూల్​ లో చదువుతున్న ఆకర్షణ భవిష్యత్​ లో మరిన్ని లైబ్రరీలను ఏర్పాటు చేసి, చిన్నారుల్లో విషయ పరిజ్ఞానంతో పాటు, పుస్తకపఠనంపై ఆసక్తి పెంచాలని పలువురు వక్తలు ఆకాంక్షించారు. ఆకర్షణ తన 25వ లైబ్రరీ ఓపెనింగ్​ కు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్రమోదీ హాజరవుతారని ఆకర్షణ తండ్రి సతీష్​ తెలిపారు.  

IMG-20241127-WA0746సుధారెడ్డి ఫౌండేషన్​ చైర్మన్​ సుధారెడ్డి, హైదరాబాద్​ పబ్లిక్​ స్కూల్​ వైస్​ ప్రిన్సిపాల్​ అమృత చంద్రరాజ్​, ప్రతినిధులు చంద్రశేఖర్​ రావు, నాగేశ్​, శ్రీయారెడ్డి, విజయలక్ష్మీ, అరుణ ప్రదీప్​ పాల్గొన్నారు.  
––––––––––––
–ఫొటో

Tags