జ్యోతి హై స్కూల్ ఐఐటి అకాడమీలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు.

On
జ్యోతి హై స్కూల్ ఐఐటి అకాడమీలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113) 

జగిత్యాల సెప్టెంబర్ 5 (ప్రజా మంటలు) : 

పట్టణంలోని జ్యోతి హై స్కూల్ ఐఐటి అకాడమీలో ఘనంగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని పాఠశాల డైరెక్టర్ బియ్యాల హరిచరణ్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.....

"మన జీవితంలో ఉన్నత స్థానం గురువుకు ఇస్తాం. మనల్ని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడంలో ఒక గురువు కృషి వెలకట్టలేనిది. అటువంటి గొప్ప వ్యక్తులను స్మరించుకుంటూ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 5వ తేదీన భారతదేశంలో టీచర్స్ డే జరుపుకుంటున్నాము అని అన్నారు.

అదే విధంగా భారతరత్న" డా॥ సర్వేపల్లి రాధాకృష్ణన్ పరిపాలన దక్షకునిగా ఖ్యాతి చెందారని చెప్పారు.

దేశ ప్రపధమ ఉపరాష్ట్రపతిగా మరియు రెండో రాష్ట్రపతి గా విశిష్ట సేవలనందించి దేశానికి ఎనలేని కీర్తి తీసుకొచ్చారని కొనియాడారు. ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనదని మరియు సవాళ్ళతో ఉన్నదని తెలుపుతూ వారి తెలివితో విషయ పరిజ్ఞానంతో చాలా సులభంగా పరిష్కరిస్తారని వారు చెప్పారు.

విద్యార్థుల అభ్యున్నతికై కృషి చేస్తున్న ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి అభినందించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు, ఉపాధ్యాయుల గొప్పతనం తెలిపే నాటికలు చూపరులను అలరించాయి.

ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు బియ్యాల హరిచరణ్ రావు, శ్రీధర్ రావు, మౌనికారావు, అజిత, రజిత పాల్గొన్నారు.

Tags