సమస్యల పరిష్కారానికి సీ.ఎం హామీ. - ఎంప్లాయిస్ జేఏసి చైర్మన్ భోగ శశిధర్ , సెక్రెటరీ జనరల్ గంగుల సంతోష్ కుమార్.

On
సమస్యల పరిష్కారానికి సీ.ఎం హామీ. - ఎంప్లాయిస్ జేఏసి చైర్మన్ భోగ శశిధర్ , సెక్రెటరీ జనరల్ గంగుల సంతోష్ కుమార్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల సెప్టెంబర్ 5 (ప్రజా మంటలు) : 

ఉద్యోగుల,ఉపాధ్యాయుల,పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని టీ ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్ భోగ శశిధర్,సెక్రటరీ జెనెరల్ గంగుల సంతోష్ కుమార్ అన్నారు.

గురువారం జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలోవారు మాట్లాడారు.

ఇటీవల కురిసిన వర్షాలకు ప్రభుత్వానికి, ప్రజలకు తీెవ్ర నష్టం సంభవించిన దృష్ట్య ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల జేఏసీ ఆపన్న హస్తం అందించడానికి ముందుకు వచ్చి ప్రభుత్వానికి సహకరించే రీతిలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ మరియు సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు గార్ల ఆద్వర్యంలొ ఉద్యోగుల ఒక రోజు వేతనం 130 కోట్ల విరాళాన్ని స్వయంగా ముఖ్యమంత్రి సమక్షంలో ప్రకటించిన దరిమిలా ఇవాళ అనేక సంఘాలు, సమాజం హర్షిస్తున్న తరుణంలో లచ్చిరెడ్డి జేఏసీ నాయకునిగా,బాధ్యునిగా పేర్కొంటూ వంద కోట్ల విరాళం తాను ఇప్పిచ్చినట్లుగా ప్రకటన చేయడాన్ని జగిత్యాల జిల్లా జెఎసి చైర్మన్ భోగ శశిధర్ మరియు సెక్రెటరీ జనరల్ గంగుల సంతోష్ కుమార్ ఖండించారు..

*ఉద్యమం అంటే పత్రిక ప్రకటనలు కాదని క్షేత్రస్థాయిలో పోరాటం చేయడమే ఉద్యమానికి నిరూపణ అని* గత ప్రభుత్వానికి కొమ్ము కాసి, తొత్తుగా వ్యవహరించి నేడు వైఖరి మారినట్టుగా ప్రజలందరినీ, *ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లని తప్పుదోవ పట్టిస్తున్న లచ్చిరెడ్డి వైఖరి సరికాదని ఆయన పేర్కొన్నారు.*

గుర్తింపు పొందిన ఉద్యోగసంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, పెన్షనర్ల సంఘాలు భాగస్వామిగా ఉన్నటువంటి జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ మరియు సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు నాయకత్వంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పెన్షనర్ల శ్రేయస్సు కొరకు పోరాటం చేస్తున్నదని ఈరోజు ఉద్యోగుల సమస్యల పట్ల పోరాటం చేస్తూనే అవసరమైన సందర్భంలో ప్రభుత్వానికి సమాజానికి వీలైనంత రీతిలో సహకరిస్తున్నదని, ఈరోజు ఒక పిలుపునిచ్చి పెన్షన్ విద్రోహ దినమున ఒక పెద్ద ఉద్యమంలా పోరాటం చేసిందని, తదనంతరం వచ్చినటువంటి వరదలలో ఆశ్రయం కోల్పోయిన నిరాశ్రయులైన అందరికీ కొంత సేవ చేయాలనే తలంపుతో ప్రభుత్వానికి విరాళం ప్రకటించిందని పేర్కొన్నారు.

ప్రకృతి వైపరీత్యాలతో వరదలు వచ్చి ప్రాణ నష్టం పంట నష్టం ఆస్తుల నష్టం జరిగి ప్రజలకు ఎంతోమంది అనారోగ్యబారిన పడ్డారని వారిని ఆదుకోవడానికి ప్రభుత్వ గుర్తింపు పొందిన భాగస్వామ్య సంఘం మారం జగదీశ్వర్ ఏలూరు శ్రీనివాసరావు ఒకరోజు మూలవేతనాన్ని 130 కోట్లు ప్రజలకు చెల్లించే విధంగా ఏకగ్రీవ తీర్మానంతో ఆమోదించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇస్తే తను కూడా పోటీపడుతూ 130 కోట్ల విరాళాన్ని తనే ఇప్పిస్తున్నట్లుగా చెప్పడం తన హేయమైన చౌకబారు దుందుడుకు చర్యలకు నిదర్శనమని జగిత్యాల జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్రంగా విమర్శించారు.

ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలని, లేకుంటే పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు..

ఈ ప్రకటనలో జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు భోగ శశిధర్ సెక్రెటరీ జనరల్ గంగుల సంతోష్ కుమార్ తో పాటు టీఎన్జీవోల జిల్లా కార్యదర్శి మిర్యాల నాగేందర్ రెడ్డి టీజీవోల జిల్లా కార్యదర్శి మామిడి రమేష్, పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కు మార్, ట్రెసా జిల్లా అధ్యక్షుడు ఎండి.వకీల్, టి.టి.యూ.జిల్లా అధ్యక్షుడు జితేందర్ రెడ్డి,నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చంద్రయ్య,పెన్షనర్ల జిల్లా కార్యదర్షి కరబూజ రవిందర్, నాయకులు గణేష్, డా.రాజేందర్ రెడ్డి, డా. శ్రీనివాస్, టి టి యు జితేందర్ రెడ్డి, ఎస్ టి యు జిల్లా కార్యదర్షి భైరం హరికిరణ్, పి ఆర్ టీ యు అద్యక్షకార్యదర్షులు యాళ్ళ అమర్నాథ్ రెడ్డి, ఆనందరావు టీఎస్ సిపి ఎస్ఈ యు అద్యక్షకార్యదర్షులు గంగాధరి మహేష్, సర్వ సతీష్, మ్యాన పవన్, మహేష్,నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అద్యక్షులు చంద్రయ్య, ఇతర సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Tags