గత దశాబ్ద కాలంలో ప్రకృతి వైపరీత్యాలప్పుడు ప్రభుత్వాలు ఆదుకున్న దాఖలాలు లేవు -పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
గత దశాబ్ద కాలంలో ప్రకృతి వైపరీత్యాలప్పుడు ప్రభుత్వాలు ఆదుకున్న దాఖలాలు లేవు -పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల సెప్టెంబర్ 4 (ప్రజా మంటలు) :
గత దశాబ్ద కాలంగా ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు గత ప్రభుత్వం ఆదుకున్న దాఖలా లేవని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు
ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ ,,,
ప్రకృతి వైపరీత్యాలతో రాష్ట్రం అంతటా వరద ఉదృతి తో అతలాకూతలం అవుతుందని,సీఎం రేవంత్ సహచర మంత్రులు స్థానికంగా ఉండి, పరిస్థితి పరిశీలన చేసి సహాయక చర్యలు చేపట్టాలని నిర్ణయించుకొని ఆ దిశగా ముందుకు వెళ్తున్నారన్నారని అన్నారు.
సమావేశంలో మున్సిపల్ ఛైర్పర్సన్ అడువల జ్యోతి, మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, సీనియర్ నాయకులు బండ శంకర్,కల్లెపల్లి దుర్గయ్య,గాజుల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్థిక చేదోడు వదోడుగా ఉండి ఆదుకోవాలని, భవన, ఇండ్లు కూలిపోయిన వారికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, పంటలు నష్టపోయినా రైతులకు ఎకరాకు 10 వేలు, ఆస్తి నష్టం తో పాటు ప్రాణ నష్టం కు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిందని గుర్తు చేశారు.
దశాబ్ద కాలంలో ప్రకృతి వైపరీత్యాల నష్టం పై ప్రభుత్వం ఆదుకున్న ఉదాంతం నేను గమనించలేదని జీవనరెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్రం ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సాయం, చేయడం ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నారు.
గతంలో. అధికారం లో ఉన్నప్పుడు ఎం చేశారు అనేది ఆత్మ విమర్శలు చేసుకోవాలి. ప్రతిపక్షం అంటే విమర్శలు మాత్రమే కాదని గుర్తు చేసారు.
కేసీఆర్ స్వయంగా పర్యటించకపోవడం, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ ద్వారా విమర్శలు చేయడం విచారకరమన్నారు.
కేటీఆర్ విదేశీ యాత్ర రద్దు చేసుకొని చర్యలు చేపట్టల్సిన అవసరం ఉండే. కాని ఎక్స్ వేదికకే పరిమితం అయ్యారని పేర్కొన్నారు.
హైడ్రా ఏర్పాటు తో హైదరాబాద్ నగర పరిధిలో జలాశయాల పరిరక్షణ కు చర్యలు గైకొంటే ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ హైడ్రా లాంటి వ్యవస్థ జిల్లా పరిధిలోకి రావాలని ప్రజానీకం కోరుకోవడం తో సీఎం రేవంత్ అక్రమణల తొలగింపు పరిరక్షణ కు చర్యలు చేపడుతామని ప్రకటించడం పై హర్షం వ్యక్తం చేస్తున్నా అన్నారు.
ఖమ్మం మున్నేరు వాగు ఆక్రమణ తో ఆ పరిస్థితి వచ్చింది. ఆక్రమణ లతో వరద ఉద్రితిని తట్టుకునే పరిస్థితి ఉండదని తెలిపారు.
భవిష్యత్ లో ఇలాంటి ఉపాధ్రవాలు కలగకుండా హైడ్రా లాంటి వ్యవస్థ ఏర్పాటు చర్యలు చేపట్టడం భవిష్యత్ తరాలకు శుభసూచకమన్నారు.
పదివేల ప్రకటన తక్షణ సాయం.. మృతుల కుటుంబలకు 5 లక్షలు ప్రకటించింది. నష్టం పదివేల కొట్లు ఉంటుందని అంచన అని గుర్తు చేశారు.
పరిహారం కనీసం 5 వేల కోట్ల అయిన గ్రాంట్ గా కల్పించాలి. సహాయక చర్యలకు తోడ్పాడాలని పిలుపునిచ్చారు.
బీఆరెస్ నాయకులు బిజెపి నాయకులు మాట్లాడే ముందు ఆలోచన చేసుకోవాలన్నారు.
ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వరదల సమయంలో నిమగ్నం అయి ఉన్నారు.
ప్రతిపక్షం రాజకీయ విమర్శలకు తావివ్వకుండా సలహాలు సూచనలు ఇవ్వండి.కిషన్ రెడ్డి బండి సంజయ్ లు గ్రాంట్ కొరకు చొరవ చూపాలన్నారు.