ఐఎమ్ఏ , రోటరీ క్లబ్, ఆపి ఆధ్వర్యంలో ఒమేగా సుశృత హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ -పాల్గొన్న DMHO .

On
ఐఎమ్ఏ , రోటరీ క్లబ్, ఆపి ఆధ్వర్యంలో ఒమేగా సుశృత హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ -పాల్గొన్న DMHO .

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల డిసెంబర్ 21 (ప్రజా మంటలు)

ఐఎమ్ఏ , రోటరీ క్లబ్, ఆపి ఆధ్వర్యంలో ఒమేగా సుశృత హాస్పిటల్ కరీంనగర్ వారి సహకారంతో జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో శనివారం ఉదయం 11 గంటలనుండి మధ్యాహ్నం 4 గంటల వరకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్, ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్. శ్రీనివాస్, ఐఎంఏ జగిత్యాల శాఖ కార్యదర్శి డాక్టర్ ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి, ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గురువారెడ్డి, ఐఎంఏ సభ్యులు డాక్టర్ నాగరాజు, ఒమేగా సుశృత హాస్పిటల్ వైద్యులు డాక్టర్ అమర్నాథ్ రెడ్డి, డాక్టర్ అర్చన తో పాటుగా శిబిరం ప్రాజెక్టు చైర్మన్, రొటేరియన్ మంచాల కృష్ణ, రోటరీ క్లబ్ పూర్వ అధ్యక్షులు, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, రోటరీ ఆపి సభ్యులు కొత్త ప్రతాప్, ఎన్నాకుల అశోక్, పాల్తెపు భూమేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

వీరితో పాటుగా హాస్పిటల్ కరీంనగర్ జిఎం చందు, ఆర్గనైజర్ రాజేందర్ తదితరులు ఉన్నారు.

ఈ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల్లో మంచిర్యాల, రామగుండం, జగిత్యాల ప్రాంతాల నుండి పలువురు చేరుకొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు, ఈ పరీక్షల్లో ప్రధానంగా టెస్టులన్నీ ఉచితంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ...

  • క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, సమతుల్య ఆహారం తీసుకోవడంతో పాటుగా క్రమశిక్షణాయుతమైన జీవన విధానం గడపడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగవని అన్నారు.
  • క్యాన్సర్ ను ముందుగానే గుర్తించేందుకు ఇలాంటి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం పట్ల నిర్వాహకులను అభినందించారు.
Tags