నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్రంలో నిరంకుశ పాలన  రాజ్యమేలుతోంది.. ఉద్దేశపూర్వకంగానే రాహుల్ గాంధీ పై  బిజెపిఎఫ్ఐఆర్ నమోదు  డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి

On
నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్రంలో నిరంకుశ పాలన  రాజ్యమేలుతోంది.. ఉద్దేశపూర్వకంగానే రాహుల్ గాంధీ పై  బిజెపిఎఫ్ఐఆర్ నమోదు  డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి

నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్రంలో నిరంకుశ పాలన  రాజ్యమేలుతోంది.. ఉద్దేశపూర్వకంగానే రాహుల్ గాంధీ పై  బిజెపిఎఫ్ఐఆర్ నమోదు 
డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి

కరీంనగర్ డిసెంబర్ 20:

నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్రంలో నిరంకుశ పాలన  రాజ్యమేలుతోంది.. ఉద్దేశపూర్వకంగానే రాహుల్ గాంధీ పై  బిజెపిఎఫ్ఐఆర్ నమోదు  క్సిందని డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి ఆరోపించారు.

అంబేద్కర్ ను అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన అమిత్ షా పై క్రిమినల్ కేసు నమోదు చేయాలనీ పిసిసి కార్యదర్శి, వైద్యుల అంజన్ కుమార్ అన్నారు.

పార్లమెంటు సాక్షిగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పై దాడికి పాల్పడడం ప్రజాస్వామ్యంపై దాడికి నిదర్శనమని డిసిసి బీసీ సెల్ చైర్మన్, పులి ఆంజనేయులు గౌడ్ విమర్శించారు 

పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పై బిజెపి నేత అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నిన్న ఇండియా కూటమి సభ్యులు  చేపట్టిన నిరసనను అడ్డుకొని ప్రతిపక్ష నేత, జాతీయ కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ గారిపై దాడికి పాల్పడడమే కాక ఉద్దేశపూర్వకంగా ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసిన బిజెపి ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఏఐసీసీ పిలుపుమేరకు నేడు  డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నగరంలోని ఇందిరా చౌక్ వద్ద నల్ల బెలూన్లతో భారీ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.

ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, వైద్యుల అంజన్ కుమార్, పులి ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని కించపరుస్తూ అంబేద్కర్ గారి పేరును ఉద్దేశించి వ్యంగంగా వ్యాఖ్యలు చేసిన బిజెపి నేత కేంద్ర మంత్రి అమిత్ షా ను వెంటనే మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని, దేశాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు పార్లమెంటు ముందు ధర్నా చేసి పార్లమెంట్ లోకి వెళ్లే క్రమంలో కొంతమంది మతోన్మాద బీజేపీ ఎంపీలు ఉద్దేశపూర్వకంగా రాహుల్ గాంధీ గారిని నెట్టి వేయడంతో అదుపుతప్పి వారు కొంతమంది సభ్యులపై పడడంతో దానిని దాడి చేసినట్లుగా చిత్రీకరిస్తూ  బిజెపి ప్రభుత్వం రాహుల్ వారిపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడం జరిగింది. పార్లమెంట్ వేదికగా గుండా విజయానికి పాల్పడుతున్న బిజెపి ఎంపీల వైఖరిని యావత్ భారత దేశ ప్రజలు గమనిస్తున్నారని ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైన హోదాలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేత పట్ల ప్రవర్తించిన తీరును కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్రంలో నిరంకుశ పాలన రాజ్యమేలుతోందని రాహుల్ గాంధీ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి పార్లమెంటు సాక్షిగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పై దాడికి పాల్పడడం ప్రజాస్వామ్యంపై దాడికి నిదర్శనమని నేతలు వాదించారు.

బిజెపి ప్రభుత్వ పాలనలో దేశంలో దళితులపై దాడులకు పాల్పడడమే కాక రాజ్యాంగ ప్రజలను దహనం చేయడం రాజ్యాంగాన్ని మారుస్తానని ప్రయత్నం చేయడం వారి మూర్ఖత్వానికి పరాకాష్టగా పేర్కొన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం అమిత్ షాను కేంద్ర హోం మంత్రి పదవి నుండి తొలగించి పార్లమెంటు సాక్షిగా యావత్ దేశ ప్రజలకు ప్రతిపక్ష నేతకు క్షమాపణలు చెప్పాలని లేనియెడల అఖిలభారత కాంగ్రెస్ కమిటీ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవలసి వస్తుందని బిజెపి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో నాయకులు గడ్డం విలాస్ రెడ్డి, పడిశెట్టి భూమయ్య,  కుర్ర పోచయ్య, అహమ్మద్ అలీ ,ఎస్ ఏ మోసిన్ ,బొబ్బిలి విక్టర్, ఆరిఫ్ అహ్మద్ ,కర్ర రాజశేఖర్, కంకణాల అనిల్ కుమార్ గుప్తా, వంగల విద్యాసాగర్, నాగుల సతీష్ ,ముస్తాక్ అహ్మద్, రోల్ల సతీష్, కొండ హరీష్, నూనె గోపాల్ రెడ్డి, కుంభాల రాజకుమార్, మాదాసు శ్రీనివాస్, మంద మహేష్ ,హాజీ ,రేగొండ సందీప్, ముల్కల కవితయోన, గంగుల దిలీప్ ,స్వప్న శ్రీ,, రూపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి ,పర్వత మల్లేశం, సత్తినేని శ్రీకాంత్ ,తీట్ల ఈశ్వరి, లక్ష్మణ్ రాజు, కుంభాల రాజ్ కుమార్, ఆరిఫ్ ఖాన్ ,అందే శంకర్, సాయిళ్ళ రాజు, ఈక్రమ్, తదితరులు పాల్గొన్నారు.

Tags

Latest Posts

ధ్యానం, యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం. - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
ఐఎమ్ఏ , రోటరీ క్లబ్, ఆపి ఆధ్వర్యంలో ఒమేగా సుశృత హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ -పాల్గొన్న DMHO .
తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్
జిల్లా సివిల్ జడ్జి మరియు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రెటరీ కే. ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ దివ్యాంగుల పట్టభద్రుల సంఘం నాయకులు
ప్రపంచ గణిత మేధావి రామానుజన్‌. - జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్.

Latest Posts

ధ్యానం, యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం. - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
ఐఎమ్ఏ , రోటరీ క్లబ్, ఆపి ఆధ్వర్యంలో ఒమేగా సుశృత హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ -పాల్గొన్న DMHO .
తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్
జిల్లా సివిల్ జడ్జి మరియు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రెటరీ కే. ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ దివ్యాంగుల పట్టభద్రుల సంఘం నాయకులు
ప్రపంచ గణిత మేధావి రామానుజన్‌. - జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్.