పెంచిన డైట్,కాస్మొటిక్ చార్జీలు- ప్రభుత్వము కు తల్లిదండ్రుల కృతజ్ఞతలు
పెంచిన డైట్,కాస్మొటిక్ చార్జీలు- ప్రభుత్వము కు తల్లిదండ్రుల కృతజ్ఞతలు
గొల్లపల్లి డిసెంబర్ 14 ప్రజా మంటలు
గొల్లపల్లి మండల కేంద్రంలోని కేజీవిపి మహాత్మ జ్యోతిరావు పూలే పాఠశాలలో ప్రభుత్వం డైట్ మరియు కాస్మోటిక్ చార్జీలను పెంచిన సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక అధికారి ఎంపీఓ సురేష్ రెడ్డి, సిడిపిఓ, చెరుకు సుస్మిత, ప్రారంభించారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి భోజనం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డైట్ మరియు కాస్మోటిక్ చార్జీలను పెంచడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మరియు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ కు ధన్యవాదాలు తెలుపుతున్నామని రాష్ట్రంలోని విద్యార్థులకు డైట్ చార్జీలను పెంచాలని సంకల్పించి డైట్ చార్జీలను పెంచడం జరిగింది. ఈ సందర్భంగా మూడవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు నెలకు 950 రూపాయలుగా ఉన్న డైట్ చార్జీలను 1330 గా మరియు ఎనిమిదో తరగతి నుండి పదవ తరగతి వరకు నెలకు 1100 ఉన్న డైట్ చార్జీలను 1540 గా ఇంటర్ నుండి పిజి వరకు 1500గా ఉన్న డైట్ చార్జీలు 2100గా పెంచడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ సురేష్ రెడ్డి , సిడిపిఓ చెరుకు సుస్మిత, రైస్ ప్రిన్సిపాల్ పాఠశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ నవ్విత, గురుకుల పాఠశాల సిబ్బంది పంచాయతీ కార్యదర్శి మధు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.