మెగా జాబ్ మేళ ను యువత సద్వినియోగం చేసుకోవాలి. : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.

50 కంపెనీల సహాయంతో IT, Non ఐటీ ,బ్యాంకింగ్, ఫార్మసీ,మొదలు రంగాలలో 2000 పైగా ఉద్యోగ అవకాశాలు.

On
మెగా జాబ్ మేళ ను యువత సద్వినియోగం చేసుకోవాలి. : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల నవంబర్ 28 (ప్రజా మంటలు) : 

 మేగా జాబ్ మేళా ను యువత సద్వినియోగపరచుకోవాలని జిల్లా ఎస్పీ అశోక్ అన్నారు.

ప్రైవేట్, కార్పొరేట్ కంపెనీ రంగంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాల్ని కల్పించేందుకు డిసెంబర్ 11వ తేదీన ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో మెగా జాబ్ మేలను జిల్లా పోలీసుల ఆద్వర్యంలో లో నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.

ఈ యొక్క జాబ్ మేళా కు సంబంధించిన పోస్టర్ ను జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయం లో ఎస్పీ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... నిరుద్యోగ యువతీ యువకులను ప్రోత్సహించాలని ఉద్దేశంతోనే పోలీస్ శాఖ వారి ఆద్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని 50 వరకు ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలు రానున్న ఈ జాబ్ మేళా ద్వారా సుమారు 2000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని తెలిపారు. ప్రముఖ కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ఇంటర్వ్యూల అనంతరం నియామక పత్రాలు అందజేస్తారని ఉత్సాహవంతులైన యువతీ, యువకులు ఈ యొక్క జాబ్ & వీసా మేళా ను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అర్హులైన యువతీ యువకులు పూర్తి వివరాలను క్యూ ఆర్ కోడ్ ద్వారా స్వయంగా సమర్పించి పేరు నమోదు చేసుకోవాలని సూచారు.

ఏమైనా సందేహాలు ఉంటే సంబధిత పోలీస్ స్టేషన్ లో సంప్రదించగలరు.

ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఎస్పీ సూచించారు.

ఈ యొక్క కార్యక్రమంలో అదనపు ఎస్పీ భీమ్ రావు, డిఎస్పిలు రవీంద్ర కుమార్, రఘు చందర్, రాములు, ఆర్ ఐ కిరణ్ కుమార్ పాల్గొన్నారు.

Tags