బీసీలకు న్యాయం చేయాలంటూ బీసీ కమిషన్ కు ఎమ్మెల్సీ కవిత సమగ్ర నివేదిక

On
బీసీలకు న్యాయం చేయాలంటూ బీసీ కమిషన్ కు ఎమ్మెల్సీ కవిత సమగ్ర నివేదిక

బీసీలకు న్యాయం చేయాలంటూ బీసీ కమిషన్ కు ఎమ్మెల్సీ కవిత సమగ్ర నివేదిక

హైదరాబాద్ నవంబర్ 25:

బీసీ వర్గాలకు జరగాల్సిన న్యాయం జరగలేదని,  డెడికేటెడ్ కమిషన్ కు 34పేజీల సమగ్ర,నివేదిక ఇచ్చామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. సొమవారం బీసీ సంఘాలు, యునైటెడ్ ఫులే ఫ్రంట్, తెలంగాణ జాగృతి నాయకులతో కలిసి జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత, గట్టు రామచంద్ర రావులు డెడికేటెడ్ కమిషన్ బుసాని వెంకటేశ్వరరావుకు 'బీసీల సమగ్ర అధ్యయన నివేదిక అందజేశారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ప్రకటించిన బి డిక్లరేషన్ ప్రకారం నడుచుకోవాలని,రాజ్యాంగం ప్రకారం బీసీలకు హక్కులు కల్పించలేదని అన్నారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చాక బీసీలకు న్యాయం జరిగిందని తెలిపారు. బీసీలకు రాజకీయంగా,ఆర్ధికంగా ప్రాంతీయ పార్టీలతోనే జరిగిందన్నారు. బీజేపీ కులగణనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో చెప్పిందని, బీజేపీ డీఎన్ఏలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకంగా ఉందని విమర్శించారు.

అదేవిధంగా బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని,బీసీలకు హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ పార్టీ.. కామారెడ్డి డిక్లరేషను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 11 నెలల పాటు బీసీ డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయలేదని, నెల రోజుల్లో డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. కులగణన కోర్టుల్లో నిలబడుతుందా లేదా  అనేది ప్రభుత్వం చెప్పాలన్నారు.

బీసీల అనుమానాలను కాంగ్రెస్ ప్రభుత్వం నివృత్తి చేయాలని సూచించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అనేక చోట్ల ఇంటికి కుల గణన స్టిక్కర్లు అంటించలేదని తెలిపారు. డెడికేటెడ్ కమీషన్ ఇండిపెండెంట్గా పని చేయాలన్నారు. కమిషన్ రిపోర్ట్ రాజకీయ రిజర్వేషన్లకు పరిమితం కాకూడదని, ఇతర బీసీ అంశాలపై నివేదిక ఇవ్వాలన్నారు. మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం చేసినట్లు బీసీల కోసం పోరాటం చేస్తామని హెచ్చరించారు.

Tags

Latest Posts

ధ్యానం, యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం. - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
ఐఎమ్ఏ , రోటరీ క్లబ్, ఆపి ఆధ్వర్యంలో ఒమేగా సుశృత హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ -పాల్గొన్న DMHO .
తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్
జిల్లా సివిల్ జడ్జి మరియు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రెటరీ కే. ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ దివ్యాంగుల పట్టభద్రుల సంఘం నాయకులు
ప్రపంచ గణిత మేధావి రామానుజన్‌. - జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్.