నీ కూతురుకు ఒక న్యాయం - వారికి పెళ్లి ..ఇతర మహిళలకు సన్యాసమా? ఇదేనా నీతి ?జగ్గీ వాసుదేవ్ కు హైకోర్టు సూటి ప్రశ్న

On
నీ కూతురుకు ఒక న్యాయం - వారికి పెళ్లి ..ఇతర మహిళలకు సన్యాసమా? ఇదేనా నీతి ?జగ్గీ వాసుదేవ్ కు హైకోర్టు సూటి ప్రశ్న

 

నీ కూతురుకు ఒక న్యాయం - వారికి పెళ్లి ..ఇతర మహిళలకు సన్యాసమా? ఇదేనా నీతి ?జగ్గీ వాసుదేవ్ కు హైకోర్టు సూటి ప్రశ్న..

చెన్నయ్ అక్టోబర్ 03:]

ఆధ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ కు మద్రాస్ హైకోర్టు ఆసక్తికరమైన ప్రశ్న సంధించింది.తన కూతుళ్ళకు పెళ్లి చేసి, విదేశాలకు పంపించి, ఇతరుల ఆడపిల్లలను మే ఆశ్రమంలో ఉంచుకోవడం న్యాయమేనా అని మద్రాస్ హైకోర్టు ఆధ్యాత్మిక గురువు జగ్గి వాడు దేవ్ ను ప్రశ్నించింది.

ఆయన నడుపుతున్న ఈషా యోగా కేంద్రంలో బాగా చదువుకున్న తమ కుమార్తెలను శాశ్వతంగా ఉంచేలా సద్గురు బ్రెయిన్ వాష్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ దాఖలు చేసుకున్న పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు కీలక ప్రశ్నలు వేసింది. తన సొంత కుమార్తెకు పెళ్లి చేసి, ఇతరుల కుమార్తెలను సన్యాసినులుగా మారేలా ఎందుకు ప్రోత్సహిస్తున్నారని సద్గురును ప్రశ్నించింది.

కోయంబత్తూరులోని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేసిన ఎస్ కామరాజ్.. తన కుమార్తెలను సద్గురు జుత్తు కత్తిరించుకుని, ప్రాపంచిక జీవితాలను త్యజించాలంటూ ప్రోత్సహించడాన్ని సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా సద్గురు ఆశ్రమంలో ఉన్న తన కుమార్తెలను హైకోర్టులో హాజరుపర్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై జస్టిస్‌ ఎస్‌ఎం సుబ్రమణ్యం, వి శివజ్ఞానంతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

నిజానికి, నిన్న కోర్టుకు హాజరైన 42, 39 ఏళ్ల ఇద్దరు మహిళలు తమ ఇష్ట ప్రకారమే సద్గురుకు చెందిన ఇషా ఫౌండేషన్‌లో ఉంటున్నామని, తమను ఎవరూ నిర్బంధించలేదని కోర్టుకు తెలిపారు. దశాబ్దాల నాటి కేసులో తమ తల్లిదండ్రులు తమ జీవితాలను వదిలేసి నరకప్రాయంగా మార్చారని పేర్కొన్నారు.

Tags