జగిత్యాల జిల్లా బాస్కెట్ బాల్ ఎంపిక పోటీలు.

On
జగిత్యాల జిల్లా బాస్కెట్ బాల్ ఎంపిక పోటీలు.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల 02 అక్టోబర్ (ప్రజా మంటలు) :

అక్టోబర్ మూడవ(3) తేదీన స్థానిక జగిత్యాల మినీ స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు బాస్కెట్ బాల్ స్త్రీలు మరియు పురుషులకు ఎంపిక పోటీలు నిర్వహించనున్నామని అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలియజేశారు .

ఇందులో ఎంపికైన వారు రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ టోర్నమెంట్లో జగిత్యాల జిల్లా జట్టులకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు.

ఆసక్తి గల క్రీడాకారులు సమయమునకు హాజరుకావాలని అసోసియేషన్ కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.

Tags