మెడికల్ కాలేజి విద్యార్థిని సన్మానించిన. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
మెడికల్ కాలేజి విద్యార్థిని సన్మానించిన. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల అక్టోబర్ 1( ప్రజా మంటలు ):
10 వ వార్డు లింగం పేటలో గంగరాజు రమేష్ కుమారుడు సూర్యతేజ కి మెడికల్ కాలేజ్ లో ఫ్రీ సీట్ రావడంతో వారి నివాసంలో సూర్యతేజను సన్మానించారు. వారి కుటుంబ సభ్యులను అభినందించారు. శాలివాహన కుటుంబంలో జన్మించి వ్యవసాయం చేస్తూ ఎం బి బి ఎస్ చదివిచడం చాలా గొప్ప విషయం అలాగే బాబు సూర్య తేజ చిన్నప్పటి నుండి డాక్టర్ కావాలి అనే కలను సాదించడం గర్వకారణం అని అన్నారు. తదుపరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఇంకా ఎన్నో విజయాలను సాధించాలి అని అన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లింగపేట వార్డుకి ఈ ప్రాంతానికి తల్లిదండ్రులకి మంచి పేరు ప్రతిష్టలు తేవాలి అని అన్నారు...ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ మాజీ సర్పంచులు కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్స్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.