ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పరచండి

On
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పరచండి

ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పరచండి
జగిత్యాల సెప్టెంబర్ 30 (  ప్రజా మంటలు    )
ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ వెంటనే అమలు పరచాలని

 సిపిఐ జిల్లా కార్యదర్శి వెన్న సురేష్ అన్నారు.        ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తున్న  ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రతి మహిళకు 2500 రూపాయలు పింఛన్ ఇవ్వాలని ప్రతి బీడీ కార్మికురాలికి 4000 రూపాయల పింఛన్ ఇవ్వాలని  ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ  ఇండ్ల ప్రక్రియ వెంటనే మొదలు పెట్టాలని సిలిండర్ సబ్సిడీ అందరికీ అందే విధంగా ఆదుకోవాలని స్థలం ఉండి డబ్బు లేని నిరుపేదలకు 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని  గ్యారంటీలో భాగంగా అర్హులైన వారికి ప్రతి నెల 4000 రూపాయలు అందేలా చర్యలు తీసుకోవాలని ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందేలా చూడాలని పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలను తగ్గే విధంగా చర్యలు చేపట్టాలని గృహలక్ష్మి పథకంపై  200 యూనిట్ల కరెంట్ చాలామంది ప్రజలకు ఇప్పటివరకు అందుబాటులో లేదని దాన్ని అందేలా చూడాలని  అన్నారు.


 ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ కార్యాచరణ తక్షణమే మొదలు పెట్టాలని సురేష్ కోరారు .ఇందులో భాగంగా సీపీఐ నాయకులు ఎండి మౌలానా 
  మణుగూరు హనుమంతు సుతారి రాములు  గాద దేవదాసు ఎండి అక్రమ్ ఏన్నం రాధ జిల్లా రైతు సంఘం అధ్యక్షులు కొండ రాజన్న కాసారం కార్యదర్శి మునుగురు గంగ నర్సయ్య కల్వకోట కార్యదర్శి బెత్తం గంగరాజం కొండాపురం కార్యదర్శి ఎదులపురం గంగరాజం మల్లాపూర్ రాజన్న ఇంకా కార్మికులు తదితరులు పాల్గొన్నారు .

Tags