తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్
తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్
చెన్నై సెప్టెంబర్ 29:
ఎన్నాళ్ళ నుండో అనుకునుకున్నట్లుగా తమిళనాడు సి ఎం స్టాలిన్ కొడుకు డిప్యూటీ సీఎం కానున్నారు.
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కొడుకు, స్పోర్ట్స్ మినిస్టర్ ఉదయనిధి స్టాలిన్ కు రాజకీయంగా ప్రమోషన్వచ్చింది.
ఉదయనిధిని డిప్యూటీ సీఎంగా నియమించాలంటూ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవికి సీఎం స్టాలిన్ శనివారం సిఫారసు చేశారు. సీఎం ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం తెలిపారు.
ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు చెన్నెలోని రాజ్ భవన్ లో గవర్నర్ సమక్షంలో ఉదయనిధి ప్రమాణం చేయనున్నారు.ఉదయనిధి ప్రస్తుతం యూత్ వెల్ఫేర్, స్పోర్ట్స్ శాఖ మంత్రిగా ఉండగా, అదనంగా ప్లానింగ్ అండ్ డెవలప్ మెంట్ శాఖను కూడా అప్పగించారు. అప్పగించారు.
గతంలో మనీలాండరింగ్ కేసులో జైలు కెళ్ళి, గురువారమే బెయిల్ పై జైలు నుంచి విడుదలైన రవాణా శాఖ మాజీ మంత్రి సెంథిల్ బాలాజీని స్టాలిన్ మళ్లీ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. బాలాజీ కూడా మంత్రిగా ప్రమాణం చేయనున్నారు.