కొనసాగుతున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మూడవ రోజు పాఠశాలల క్రీడలు.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల సెప్టెంబర్ 27 (ప్రజా మంటలు) :
శుక్రవారం అండర్ 14బాలికల కబడ్డీ ఖో,ఖో. వాలీబాల్ పోటీలు నిర్వహించనట్లు డి ఈ ఓ బి. జగన్మోహన్ రెడ్డి తెలిపారు.
ఈ రోజు జరిగిన పోటీలలో విజేతలు .
వాలీబాల్ :
ప్రథమ, మేడిపల్లి మండలం, ద్వితీయ , జగిత్యాల మండలం,
కబడ్డి :
ప్రథమ , మెట్పల్లి మండలం, ద్వితీయ, గొల్లపల్లి మండలం.
ఖో,ఖో :
ప్రథమ, మేడిపల్లి, ద్వితీయ, కత్లాపూర్ మండలం లు విజేతలయ్యారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతితులుగా విచ్చేసిన జగిత్యాల రూరల్ ఎం ఈ ఓ గాయత్రి , ఎస్ కె ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అశోక్ మాట్లాడుతూ....
విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతొ అవసరమని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్ జి ఎఫ్ కార్యదర్శి లక్ష్మీ రామ్ నాయక్,పేట అధ్యక్ష కార్యదర్శులు విశ్వ ప్రసాద్,అశోక్, పిడి లు కృష్ణప్రసాద్,అజయ్,కోటేశ్వర,భాస్కర్,వేణు,దయాకర్,రవి తదితరులు పాల్గొన్నారు.