ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉంది -మీ ప్రతి కష్టాన్ని నా కష్టంగా భావిస్తా - విప్ లక్ష్మణ్ కుమార్
ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉంది -మీ ప్రతి కష్టాన్ని నా కష్టంగా భావిస్తా - విప్ లక్ష్మణ్ కుమార్
వెల్గటూరు సెప్టెంబర్ 11:
ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉంది -మీ ప్రతి కష్టాన్ని నా కష్టంగా భావిస్తానని ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు.
ఎల్లంపల్లి నిర్వాసితులకు పరిహారాన్ని మంజూరు చేసిన సిఎం రేవంత్ రెడ్డికి,ప్రభుత్వానికి విప్ లక్ష్మణ్ కుమార్ దన్యవాదాలు తెలిపారు.
10 సంవత్సరాలు నిర్వాసితుల గురించి పట్టించుకోని ప్రతిపక్షాలు ఇప్పుడు మా పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయనీ అన్నారు.
వెల్గటూర్ మండలానికి చెందిన 45,05,220 లక్షల రూపాయల విలువ గల 45 చెక్కులను మరియు ఎండపెల్లి మండలానికి చెందిన 31,03,596 లక్షల రూపాయల విలువ గల 31 చెక్కులను అర్హులైన లబ్దిదారులకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు బుధవారం రోజున వెల్గటూర్ ఎంపీడీవో కార్యాలయంలో పంపిణీ చేశారు.
అనంతరం వెల్గటూర్ మండలం ముక్కట్రావు పేటకు చెందిన ఎల్లంపల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు సంబంధించి ప్రభుత్వం నుండి మంజూరు అయిన 52 లక్షల విలువ గల 24 పరిహార చెక్కులను జిల్లా RDO గారితో కలిసి లబ్దిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..కళ్యాణ లక్ష్మీ చెక్కులను అందుకున్న ప్రతి లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలుపుతున్నామని,శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులైన ముక్కట్రావు పేట గ్రామనికి చెందిన 24 మంది కుటుంబాలకు ప్రభుత్వం నుండి మంజూరు అయినా పరిహారం చెక్కులను పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని,పరిహారం అందని వారు ఎటువంటి బాధ పడాల్సిన అవసరం లేదనీ మిగిలిన వారికి కూడా త్వరలోనే పరిహారం అదే విధంగా చర్యలు తీసుకుంటామని,అదే విధంగా చేగ్యం గ్రామానికి చెందిన 126 భూ నిర్వాసితుల కుటుంబాలకు చెందిన 18 కోట్ల రూపాయలను కూడా మంజూరు చేయాలనీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మరియు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి,మంత్రి శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి అట్టి డబ్బులను కూడా మంజూరు చేయించడం జరిగిందని,వాటిని కూడా త్వరలోనే నిర్వాసితులకు పంపిణీ చేస్తామని,ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉందని,మీ ప్రతి కష్టాన్ని నా కష్టంగా భావించడం జరుగుతుందని,10 సంవత్సరాలు ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వాసితుల గురించి పట్టించుకోని బిఆర్ఎస్ నాయకులు పని కట్టుకుని మాపైన బురద జల్లే ప్రయత్నం చేయడం జరుగుతుందని, ప్రజలు వారి మాటలపై అప్రమత్తంగా ఉండాలని,నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని,మి ప్రతి కష్టం ముందు నేను నిలబడి ఉంటానని,ఎవరికి ఎటువంటి అవసరం ఉన్న నన్ను నేరుగా కలవవచ్చని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.