జగిత్యాల జిల్లాలో 9 మంది ఎమ్మార్వోల బదిలీ
On
జగిత్యాల జిల్లాలో 9 మంది ఎమ్మార్వోల బదిలీ
జగిత్యాల సెప్టెంబర్ 03 ( ప్రజా మంటలు) : జగిత్యాల జిల్లాలోని తొమ్మిది మంది తహశీల్దార్ లను జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కథలాపూర్ ఎమ్మార్వో గా వి.వినోద్ ను పెగడపల్లి ఎమ్మార్వోగా, రవీందర్ నియామకమయ్యారు., పెగడపల్లిలో పని చేసిన ఆర్.శ్రీనివాస్ ను మెట్ పల్లి కి కథలపూర్ లో పనిచేస్తున్న ముంతాజ్బుద్ధిన్ బీర్పూర్ బదిలీ కాగా అక్కడ ఉన్న ఏ శ్రీనివాస్ జగిత్యాల రూరల్ కు, రూరల్ ఎమ్మార్వో గా ఉన్న సి.రామ్ మోహన్ జగిత్యాల అర్బన్ కు బదిలీ చేశారు. జగిత్యాల రూరల్ ఎమ్మార్వో గా ఉన్న వరందన్ సారంగాపూర్ కు అక్కడ ఉన్న జి రమేష్ కొడిమ్యాల కు బదిలీ చేయగా కొడిమ్యాల ఎమ్మార్వో గా పని చేసిన బి.రాజమణి కోరుట్ల డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా బదిలీ అయ్యారు.
Tags