డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం దరఖాస్తు స్వీకరణలు ఈ నెల 17 వరకు పొడిగింపు - జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.

On
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం దరఖాస్తు స్వీకరణలు ఈ నెల 17 వరకు పొడిగింపు - జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల సెప్టెంబర్ 9 (ప్రజా మంటలు) : 

జిల్లా మున్సిపాలిటీ పరిధిలో నూక పెల్లి డబుల్ బెడ్ రూం ఇండ్లలో లబ్దిదారులకు పంపిణీ చేయగా మిగిలిన ఇండ్లకు మీ సేవ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 9 వ తేదీ ముగుస్తుందని, ఈ సందర్భంలో అప్లికేషన్లు స్వీకరించుటకు ఈ నెల 17 వరకు పొడగించినట్లు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.

లబ్ధిదారులు కుల ధ్రువీకరణ, ఆదాయ సర్టిఫికెట్లు తెచ్చుకోనుటలో జాప్యం వలన అసలైన లబ్ధిదారులు నష్టపోకుండా ఉండటం కోసం అప్లికేషన్ల స్వీకరణను గడువు పెంచినట్లు పేర్కొన్నారు.

గతంలో తెలిపిన విధంగా మీ సేవ కేంద్రం ద్వారా నూతన ఆర్జి దారులు దరఖాస్తు చేసుకొని, డాక్యుమెంట్లు లేని యెడల మీ సేవలో డాక్యుమెంట్లు స్వీకరించబడవని తెలిపారు.

మీ సేవ కేంద్రంలో ఆర్జీదారులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆర్జిలు స్వీకరించవలెనని కలెక్టర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Tags

Latest Posts

ధ్యానం, యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం. - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
ఐఎమ్ఏ , రోటరీ క్లబ్, ఆపి ఆధ్వర్యంలో ఒమేగా సుశృత హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ -పాల్గొన్న DMHO .
తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్
జిల్లా సివిల్ జడ్జి మరియు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రెటరీ కే. ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ దివ్యాంగుల పట్టభద్రుల సంఘం నాయకులు
ప్రపంచ గణిత మేధావి రామానుజన్‌. - జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్.