ప్రజారోగ్యం ప్రస్తుత ప్రధాన లక్ష్యం  - ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ 

On
ప్రజారోగ్యం ప్రస్తుత ప్రధాన లక్ష్యం  - ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ 

ప్రజారోగ్యం ప్రస్తుత ప్రధాన లక్ష్యం
 - ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ 

 (రామ కిష్టయ్య సంగన భట్ల)

ధర్మపురి సెప్టెంబర్ 09:
 ప్రస్తుత వర్షాకాల పరిస్థితులలో ప్రజారోగ్య పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యం అని ప్రభుత్వ  విప్, డిసిసి అధ్యక్షుడు, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి 
లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం ఎమ్మెల్యే ధర్మపురి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ...వ్యాధుల బారిన పడిన ప్రజల ఇబ్బందుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా విఫలం అయిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రెస్ మీట్ లో  ఆరోపించడాన్ని లక్ష్మణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. జిల్లాలో విష జ్వరాలు ప్రబలు తున్న విషయం వాస్తవమని, అయితే జిల్లా యంత్రాంగం పూర్తి చర్యలు చేపడుతున్నదని అన్నారు. జిల్లా కలెక్టర్ అన్ని ఆసుపత్రులు సందర్శించి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. మేడారం, పైడిపెల్లి తదితర గ్రామాల్లో  వైద్య శిబిరాలు నిర్వహించా మన్నారు. అన్ని ఆసుపత్రులలో మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. త్వరలో ధర్మపురిలో కలెక్టర్ ఆధ్వర్యంలో మెగా వైద్య పరీక్షల శిబిరం నిర్వహిస్తామన్నారు. ఎ ఎన్ ఎంలు, ఆశా కార్యకర్తలు ఇల్లిల్లూ తిరుగుతూ సహకారం అందిస్తున్నారన్నారు. మాజీ మంత్రి కొప్పుల ప్రభుత్వంపై బురద చల్లే ఆలోచన మానుకోవాలన్నారు. కరోనా విజృంభణ సమయంలో, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆరోగ్య మంత్రి హరీష్ రావు, బాధుల చికిత్సను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చ లేదన్నారు. ధర్మపురి ప్రాంత రోగులకు కనీసం అంబులెన్స్ సౌకరం కల్పించే ప్రయత్నం జరగ లేదన్నారు. బెడ్స్ లేక ఆసుపత్రులు నిండుగా ఉంటే నాడు ప్రభుత్వం చేతులు ఎత్తి కూర్చుందన్నారు. ధర్మపురిలో మాతా శిశు ఆసుపత్రికి ప్రారంభోత్సవం చేశారే తప్ప, అందుబాటులోకి తేలేదన్నారు. ఇంకా పనులు మిగిలే ఉన్నాయన్నారు. ప్రధాన ఆసుపత్రిలో ఐ సి యూ ప్రారంభం చేయలేదన్నారు. తాము నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని రకాలా బాగోగులు చూస్తున్నామని నొక్కి చెప్పారు.
పి సి సి సభ్యులు దినేష్, నాయకులు జక్కు రవి, చిలుముల లక్ష్మణ్, వేముల రాజేశ్, ప్రసాద్, కస్తూరి శ్రీనివాస్, సి. హెచ్ రాజేశ్, కుంట సుధాకర్, సుముఖ్, నిషాంత్ రెడ్డి, అప్పం శ్రావణ్, మొగిలి తదితరులు పాల్గొన్నారు.

Tags