పంట నష్టం పోయిన ప్రతి ఒక్క రైతు కు పరిహారం అందేలా చూడాలి..

క్షేత్ర స్థాయి లో పర్యవేక్షణ చేసి ప్రభుత్వానికి నివేదిక పంపండి...

On
పంట నష్టం పోయిన ప్రతి ఒక్క రైతు కు పరిహారం అందేలా చూడాలి..

- ఏ ఒక్క రైతు కూడా నష్టపోవద్దు...

ఎల్కతుర్తి సెప్టెంబర్ 6 ప్రజామంటలు (కందుకూరి రాజన్న)

ఎల్కతుర్తి మండల కేంద్రంలోని పలు గ్రామాలలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్ట పోయిన రైతు లకు పరిహారం పక్కాగా అందేలా చూడాలని రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షులు హింగే భాస్కర్ ఎల్కతుర్తి మండలంలో ఏ ఒక్క రైతు కూడా నష్ట పోవొద్దు అని, పంట నష్ట పోయిన ప్రతి ఒక్క రైతు కు 10వేల రూపాయల పరిహారం అందేలా చూడాలని, ఎక్కడ నష్టం జరిగిందో గుర్తించి క్షేత్ర స్థాయి లో పర్యటించి ప్రభుత్వం కు నివేదిక ఇవ్వాలని సూచించారు..పంట నష్ట పోయిన ఏ ఒక్క రైతు కు నష్టం జరగొద్దని చెప్పారు.. ఈ కార్యక్రమం లో మండల రైతులు గ్రామాల రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు

Tags