గ్రూపు-1 అభ్యర్థులకు అందుబాటులో ఆర్టీసీ సేవలు.
- జగిత్యాల డిపో మేనేజర్ సునీత.
On
(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల జూన్ 8 (ప్రజా మంటలు) :
జగిత్యాల జిల్లా కేంద్రంలో గ్రూప్ -1 నేడు పరీక్ష వ్రాసే అభ్యర్థులందరికీ ఆర్టీసీ బస్సు సేవలు అందిస్తామని జగిత్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ సునీత తెలిపారు.
ఆదివారం పరీక్ష వ్రాసే అభ్యర్థులు తమ తమ గ్రామాల నుండి జగిత్యాల చేరుకునేందుకు టీజీఎస్ఆర్టిసి జగిత్యాల డిపో పక్షాన తగినన్ని బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ధర్మారం, ధర్మపురి, రాయికల్, కడెం, జన్నారం, పెగడపల్లి , కరీంనగర్ రూట్లలో బస్సులను నడపనున్నట్లు డిఎం వివరించారు. అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని సునీత కోరారు.
Tags