అన్న ను గెలిపించుకున్న చెల్లి.
నేడే అసలైన రాఖీ పండగ. - జగిత్యాల బీజేపీ శ్రేణులు.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113):
జగిత్యాల జూన్ 04 (ప్రజా మంటలు) :
రాజకీయంగా నా అనుకున్న గత పార్టీ పెద్దలే తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తే తన ప్రాణాలు సైతం లక్ష్య పెట్టక ఊబి వంటి వారి కబంధ హస్తాల నుంచి పైకి ఎగిసి కమలంగా ఏర్పడి తన ప్రజాసేవా, అకుంఠితదీక్ష తో తనను చేరదీసిన పార్టీ నియోజకవర్గ స్థాయిలో నేటి లోక్ సభ ఎన్నికల ఫలితాల ద్వారా మరింత వికసించేలా చేసిన మహిళా శక్తి జగిత్యాల బిజెపి ఎంఎల్ఏ అభ్యర్థి డా. భోగ శ్రావణి అని నియోజకవర్గ బీజేపీ శ్రేణులు తనను కొనియాడారు.
సునిశిత శక్తితో తన పార్టీ శ్రేణులను అందరినీ కలుపుకుంటూ పోతూ నియోజక వర్గంలో బిజెపి పార్టీ యొక్క ప్రభంజనం మరింత పెరిగేలా చేయడంతో బిజెపి విజయ సాధన ముందుగా నిర్ణయం అయ్యింది అని బిజెపి శ్రేణులు గర్వంగా చెప్పుకుంటున్నారు.
అలాగే తనలో విశ్వాసం నింపి తనను నమ్మి బీజేపీలో కార్యవర్గ సభ్యురాలిగా, ఎంఎల్ఏ అభ్యర్థి గా ఎదగడంలో సహకరించిన తన దేవుడిచ్చిన అన్నయ్య ధర్మపురి అరవింద్ ఎంపీ గా గెలవడం కోసం జిల్లా నుండి నియోజకవర్గం స్థాయిలో గడప గడపకు తిరుగుతూ అహర్నిశలు కష్టపడ్డ విధానం తాలూకా నేటి విజయాన్ని చూసి గెలవడం మాత్రమే కాదు గెలిపించుకోవడంలో ఉంటుంది కాషాయ పొగరు అని నియోజకవర్గ బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటూ నేటి లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో గెలిచిన ధర్మపురి అరవింద్ కు వారి గెలుపుగా భావిస్తూ, ఈ విజయ గర్వంలో డా.భోగ శ్రావణి తో వారు ఉన్నందుకు ఈరోజే మాకు అసలైన రాఖీ పండగ అని అలాయ్ బలాయ్ లు చేసుకుంటున్నారు నియోజక వర్గ బిజెపి శ్రేణులు.
ఈ సందర్భంగా తనతో పాటు ఆర్వీంద్ అన్న గెలుపులో పాలు పంచుకున్న ప్రతీ ఒక్క కార్యకర్తకు తన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు డా. భోగ శ్రావణి.