జిల్లా పరిధిలో ప్రశాంతంగా జరిగిన పోలింగ్ - జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్

On
జిల్లా పరిధిలో ప్రశాంతంగా జరిగిన పోలింగ్ - జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల మే 13 (ప్రజా మంటలు )

లోక్ సభ ఎన్నికల పోలింగ్ జిల్లాలో ప్రశాంతంగా జరిగినట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు.

ఎన్నికలు జరుగుతున్న పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.

ప్రజలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అని అన్నారు.

జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసారు.

పెట్రోలింగ్ వాహనాలు మరియు ప్రత్యేక పోలీసు బృందాలు నిరంతరం పర్యటిస్తూ శాంతిభద్రతలను పర్యవేక్షించాయని తెలిపారు.

పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారుల కు మరియు సిబ్బందికి ఎస్పీ భద్రత పరమైన పలు సూచనలు చేశారు.

Tags