బాల్యవివాహ్ ముఖ్త్ భారత్ హైదరాబాద్ జిల్లా సాధనకు ముందడుగు
బాల్యవివాహ్ ముఖ్త్ భారత్ హైదరాబాద్ జిల్లా సాధనకు ముందడుగు
* అశ్రిత సంస్థ ఆధ్వర్యంలో అవెర్నెస్ క్యాంపులు
సికింద్రాబాద్, నవంబర్ 28 ( ప్రజామంటలు ):
ఆశ్రిత సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖ హైదరాబాదు ఆధ్వర్యంలో బాల్య వివాహ్ ముక్త్ భారత్ కార్యక్రమాన్ని వెస్ట్ మారెడ్ పల్లిలోని ఉమెన్ ఎంపవర్మెంట్ ట్రైనింగ్ సెంటర్ లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ ఆర్డీఓ సాయిరాం హాజరై విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. బాల్య వివాహాల చట్టాలను వివరిస్తూ, విద్యార్థులు చదువు పట్ల శ్రద్ద వహించాలని, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలన్నారు. పేరేంట్స్ను గౌరవిస్తూ, వారి మాటలను వినాలని సూచించారు. తెలంగాణ విద్యా కమిషన్, కమిటీ సలహా సభ్యులు వెంకటరెడ్డి, జిల్లా బాలల సంక్షేమ మండలి మెంబర్ నబీ, అశ్రిత సంస్థ డైరెక్టర్ నాగరాజు లు మాట్లాడుతూ..బాల్య వివాహాలను బాలలకు దూరంగా ఉంచాలని, దేశవ్యాప్తంగా జరుగుతున్న బాల్య వివాహ్ ముక్త్ భారత్ సాక్షిగా బాల్య వివాహాలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఇందుకు ప్రభుత్వంలోని ప్రతి డిపార్ట్ మెంట్ అధికారులు, సిబ్బంది సపోర్టు కావాలని కోరారు. యూనిసెఫ్ నుంచి డేవిడ్ , బాల్య వివాహాల నిరోధక చట్టం , జెజె యాక్ట్ గురించి చెప్పారు. ఎవరైనా బాల్య వివాహాలను చేస్తే వెంటనే 1098 లేదా 100, 112 నెంబర్లకు కాల్ చేయాలని కోరారు. 2030 నాటికి బాల్య వివాహ ముక్త్ భారత దేశాన్ని నిర్మించాలని కోరుతూ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డిస్ర్టిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి శ్రీనివాస్, సీడీపీవోలు, సూపర్ వైజర్స్, అంగన్ వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం జిల్లాలోని 50 వార్డులల్లో ప్రజాప్రతినిధులు, కమ్యూనిటీ, కాలేజీల్లో వీదుల్లో 4800 మందితో క్యాండిల్ వెలిగిస్తూ, ప్రతిజ్ఞ చేశారు. బాల్య వివాహ్ ముక్త భారత్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో 50 వార్డుల్లో అవెర్నెస్ కార్యక్రమాలను కంటిన్యూగా చేస్తామని, బాల్య వివాహాల నిరోదక చట్టం–2006 ను విజయవంతంగా అమలు చేయడంలో అశ్రిత సంస్థ ముందుంటుందని డైరెక్టర్ నాగరాజు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
––––––––