ఏడాదిలోనే 55వేల ఉద్యోగాలను భర్తీ చేశాం, అప్పులు చేసైనా హామీలను అమలు చేస్తున్నాం. - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల జనవరి 6 (ప్రజా మంటలు) :
బీఆర్ఎస్ పార్టీ పదేళ్ళల్లో భర్తీ చేయని ఉద్యోగాలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 12 నెలల్లోనే 55 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, పట్టభధ్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు.
పంజాబ్ రాష్ట్రంలో 33 నెలల్లో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేసి గొప్పగా చెప్పుకుంటున్నారని ఏద్దేవా చేశారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డి సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను అమలు చేసెందుకు కాల పరిమితి ఐదు సంవత్సరాలున్నా
కాంగ్రెస్ పార్టీ మాత్రం నిరుపేద వర్గాలకు సంక్షేమ పథలకాలను అందించేందుకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ పథకాలనుదశల వారీగా అమలు చేస్తున్నామన్నారు.
రాజశేఖర్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచిత విద్యుత్ అమలు చేయగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గృహ అవసరాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేస్తుoదన్నారు.
వంట గ్యాస్ మహిళకు ఆర్థిక భారం పడకుండా మూడు నెలల్లో 500లకే అమలు చేసినమన్నారు.
ఏక మొత్తంగా రుణ మాఫీ చేయడం కాంగ్రెస్ పార్టీకె మాత్రమే సాధ్యమైందని యూపీఏ ప్రభుత్వం రైతులను రుణ విముక్తులను చేసేందుకు ఏక మొత్తంగా లక్ష రూపాయలు రుణ మాఫీ చేసి0దని కానీ బీజేపీ కనీసం రైతులకు రుణ మాఫీ చేయాలనే ఆలోచన కూడా చేయలేదనీ జీవన్ రెడ్డి విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తీరును హర్శించాల్సింది పోయి విమర్శించడం..బాధాకరమనన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని రైతు భరోసా అమలు చేస్తున్నారని బీజేపీ విమర్శించడంపై జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
సన్న రకాలకు మద్దతు ధరకు అదనంగా బోనస్ రు.500 ఇస్తున్నది కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రమే అని పునరుద్ఘాటించారు.
సన్న బియ్యం ఇవ్వాలనే కూడా సంకల్పించామని వివరించారు.
ఎనిమిదేళ్లుగా మెస్ చార్జీలు పెంచలేదు.. నిరుపేదలకు నాణ్యమైన భోజనం పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ మెస్ చార్జీలు పెంచిందన్నారు.
బీ ఆర్ ఎస్ ప్రభుత్వం పదేళ్లు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని,కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు రేషన్ కార్డు ఆరోగ్య భద్రత..జనవరి 26 నుండి రేషన్ కార్డులు జారీ చేస్తున్నామన్నారు.
ప్రతి పక్షాలు ప్రభుత్వాన్ని విమర్శలు చేయడమే కాదు..మంచిని కూడా గ్రహించాలి జీవన్ రెడ్డి హితవు పలికారు.
సమావేశంలో నాయకులు విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, బండ శంకర్, పుప్పాల అశోక్,దుర్గయ్య,బీరం రాజేష్, గుంటి జగదీశ్వర్, చందా రాధకిషన్,కమటాల శ్రీనివాస్,స్వామి రెడ్డి, పరీక్షిత్ రెడ్డి, లైశెట్టి విజయ్, బొల్లి శేఖర్, ధర రమేష్ బాబు, భారీ,గంగం మహేష్,రజినీకాంత్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.