పెన్షనర్లకు ఆదాయపు పన్ను రద్దు చేయాలి - పెన్షనర్ల రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్.
పెన్షనర్లకు ఆదాయపు పన్ను రద్దు చేయాలి - పెన్షనర్ల రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్.
జగిత్యాల జనవరి 06:
కేంద్రప్రభుత్వం పెన్షనర్లను ఆదాయపు పన్ను నుంచి మినహాయించాలని,పాత పెన్షన్ పథకం ను పునరుద్ధరణకు పీ.ఎఫ్.ఆర్.డి.ఎ
చట్టాన్ని రద్దు చేయాలని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు.సోమవారం తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెన్షనర్లకు ఆదాయపు పన్ను రద్దుపై సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ గౌరవ భృతిగా ప్రతి నెల పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ పై కేంద్రం ఆదాయపు పన్ను రద్దు చేయాలన్నారు. తమ తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు గాజుల నర్సయ్య ఆధ్వర్యంలో గత పదేళ్లుగా ప్రధాన మంత్రి,కేంద్ర ఆర్ధికమంత్రి లకు పోస్టు కార్డుల ద్వారా వినతులు రాసి పంపిస్తున్నామన్నారు.ఢిల్లీ వెళ్లి పలు మార్లు జంతర్ మంతర్ వద్ద ధర్నాలు చేసి కేంద్ర మంత్రులను కలిసి పెన్షనర్లకు ప్రతి నెలా ఇచ్చే గౌరవ భృతి పెన్షన్ పై ఆదాయపు పన్ను రద్దు చేయాలని కోరామన్నారు. టీ పెన్షనర్స్ జిల్లా శాఖ కార్యదర్శి బొల్లం విజయ్,కోశాధికారి గౌరిశెట్టి విశ్వనాథం, సహాయ అధ్యక్షుడు పి.సి.హన్మంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు వెల్ముల ప్రకాష్ రావు, ఎం.డి.యాకూబ్,ఆర్గనైజింగ్ కార్యదర్శి పూసాల అశోక్ రావు, సంయుక్త కార్యదర్శి దిండిగాల విఠల్,నాయకులు ఎం.డి.ఇక్బాల్, కోరుట్ల అధ్యక్షుడు పబ్బా శివానందం,ధర్మపురి అధ్యక్షుడు కండ్లే గంగాధర్,కార్యదర్శి సౌదరి దుబ్బేశం,మల్యాల అధ్యక్షుడు ఎం.డి. యాకూబ్,మెట్ పల్లి అధ్యక్షుడు వి.ప్రభాకర్ రావు,విధ మండలాల పెన్షనర్ల అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.