చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం మళ్ళీ వాయిదా పడనుందా?
చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం మళ్ళీ వాయిదా పడనుందా?
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో ప్రభుత్వ కార్యక్రమాలు రద్దు
హైదారాబాద్ డిసెంబర్ 27:
ఎంతో ఆడంబరంగా ప్రారంభించాలని కొన్న చర్లపల్లి రైల్వే స్టేషన్ రేపు 28 న ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. కానీ,మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో ప్రభుత్వ కార్యక్రమాలు రద్దు చేయడంతో ఈ ప్రారంభోత్సవం కూడా రద్దైనట్లు తెలుస్తుంది. మళ్ళీ త్వరలోనే కొత్త తేదీలను ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు.
చర్లపల్లి స్టేషన్ విశేషాలు
దాదాపు 100 సంవత్సరాల తర్వాతతెలుగు రాష్ట్రాలలో, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రూ.4288 కోట్లతో అత్యాధునిక వసతులతో, హైదరాబాద్ నగరంలో మరో కొత్త రైల్వేస్టేషన్ రూపుదిద్దుకుంది.
ప్రస్తుతం ఉన్న చర్లపల్లి స్టేషన్ కు అత్యాధునిక సదుపాయాలు కల్పించి హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లపై ఉండే ఒత్తిడిని తగ్గించబోతున్నారు. విమానాశ్రయం తరహాలో తీర్చిదిద్దిన ఈ టెర్మినల్ ను శనివారం రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రారంభించబోతున్నారు.
చర్లపల్లి రైల్వే స్టేషన్ లో 19 లైన్ల సామర్థ్యం
ప్రస్తుతం 5 ప్లాట్ ఫామ్స్ ఉంటే వాటి సంఖ్యను 9కి పెంచారు. 19 లైన్ల సామర్థ్యాన్ని చర్లపల్లి కలిగివుంటుంది. 9 లిఫ్ట్ లు, 5 ఎస్కలేటర్లు, రెండు ఫుట్ ఓవర్ వంతెనలు అందుబాటులోకి రానున్నాయి. స్టేషన్ రెండో ముఖద్వారాన్ని అభివృద్ధి చేశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. సమయానికి రైళ్లు అక్కడకు చేరుకుంటున్నప్పటికీ ప్లాట్ ఫామ్స్ ఖాళీగా ఉండకపోవడంతో వాటిని శివారు ప్రాంతాల్లో నిలిపివేస్తుండటంతో గంటల తరబడి సమయం వృథా అవుతోంది.
దీన్ని నివారించేందుకు చర్లపల్లిని అధికారులు ప్రత్యామ్నాయ స్టేషన్ గా తీర్చిదిద్దారు. అక్కడి నుంచి నగరంలోకి చేరుకోవడానికి ఎంఎంటీఎస్ రైళ్లను అనుసంధానం చేస్తున్నారు. వాస్తవానికి దీన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభిస్తారనుకున్నప్పటికీ షెడ్యూల్ ఖాళీలేక పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. చివరకు అశ్వనీ వైష్ణవ్ ప్రారంభిస్తున్నారు.
6 ఎక్స్ ప్రెస్ రైళ్లు ఇక్కడి నుంచి నడిచేలా, 12 రైళ్లను ఈ స్టేషన్ లో ఆపేలా అనుమతులు వచ్చాయి. హౌరా, షాలిమార్, సంత్రాగచ్చి, జమ్ము, జైపూర్, పాట్నాలాంటి దూర ప్రాంతాలకు నడిచే రైళ్లు భవిష్యత్తులో ఇక్కడి నుంచే నడవనున్నాయి.
చర్లపల్లి నుంచి నడిచే రైళ్లు
12603 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్
12604 హైదరాబాద్ - ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - హైదరాబాద్ ఎక్స్ప్రెస్
12589/12590 గోరఖ్పూర్ సికింద్రాబాద్ గోరఖ్ పూర్
18045 షాలిమార్ - హైదరాబాద్ ఈస్ట్కస్టు ఎక్స్ప్రెస్
18046 హైదరాబాద్ షాలిమార్ ఈస్ట్కస్టు ఎక్స్ప్రెస్
చర్లపల్లి స్టేషన్ లో ఆగేవి
12757/12758 సికింద్రాబాద్ సిర్పూర్ కాగజ్నగర్ - సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్
17233/17234 సికింద్రాబాద్- సిర్పూర్ కాగజ్నగర్ - సికింద్రాబాద్ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్
17011/17012 హైదరాబాద్ సిర్పూర్ కాగజ్నగర్ – హైదరాబాద్ ఎక్స్ప్రెస్
12713/123714 విజయవాడ సికింద్రాబాద్ - విజయవాడ శాతవాహన ఎక్స్ప్రెస్
17201/17202 గుంటూరు- సికింద్రాబాద్ - గుంటూరు గోల్కొండ ఎక్స్ప్రెస్
12705/12706 గుంటూరు సికింద్రాబాద్ - గుంటూరు ఎక్స్ప్రెస్