ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్ ల నిరసన

On
ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్ ల నిరసన

ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్ ల నిరసన
  *  పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి
  *  గాంధీ విగ్రహం వద్ద సర్పంచ్​ ల జేఏసీ నేతలు

సికింద్రాబాద్​ డిసెంబర్​ 24 (ప్రజామంటలు) :

పెండింగ్ లో ఉన్న గ్రామపంచాయతీ మాజీ సర్పంచుల బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని రాష్ట్ర మాజీ సర్పంచుల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు.  మంగళవారం గాంధీ ఆసుపత్రి ఎదురుగా ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం ముందు మాజీ సర్పంచులు  ఈనెల 27న చేపట్టబోయే నిరసన కార్యక్రమానికి సంబందించిన వాల్ పోస్టర్ లను విడుదల చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ మాట్లాడుతూ... మాజీ సర్పంచ్ ల బాధలు వర్ణానాతీతమని, సర్పంచులుగా గెలిచిన పాపానికి అప్పులు చేసి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తే ప్రభుత్వాలు పట్టించుకోకుండా, పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాయని అన్నారు. అసెంబ్లీలో  ప్రతిపక్ష పార్టీలైన బిఆర్ఎస్, బీజేపీ ల ఎమ్మెల్యేలు తమ సమస్యలను ప్రస్తావిస్తే అధికార పార్టీ ఎమ్మెల్యేలు అవహేళన చేస్తూ మాట్లాడి, సర్పంచుల సమస్యను మరింత జటిలం చేసే విధంగా వ్యవహరించారని అన్నారు. అందుకు                            నిరసనగా ఈ నెల 27 న తెలంగాణా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాలకు వినతిపత్రాలు ఇవ్వాలని మాజీ సర్పంచుల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున  పిలుపునిస్తున్నామని అన్నారు. మహాత్మా గాంధీ కలలు గన్న గ్రామస్వరాజ్యం కోసం తాము కృషి చేశామని, ఇప్పుడు తాము అప్పులపాలై అత్యంత దీనస్థితిలో ఉంటే ప్రభుత్వం కనికరించక పోవడం దురదృష్టకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించిన తరువాతనే ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు వెళ్లాలని లేని పక్షంలో ఆ ఎన్నికలను అడ్డుకుంటామని అన్నారు.  ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మాజీ సర్పంచుల జాయింట్ యాక్షన్ కమిటీ ఉపాధ్యక్షుడు జీ.మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, గణేష్, మల్లయ్య, పూర్ణచందర్ గౌడ్ పాల్గొన్నారు. 

Tags