ఎల్కతుర్తి మండల కేంద్రంలో సిపిఐ 99వ వార్షికోత్సవాలు
ఎల్కతుర్తి మండల కేంద్రంలో సిపిఐ 99వ వార్షికోత్సవాలు
ఎల్కతుర్తి డిసెంబర్ 23 (ప్రజా మంటలు9:
సిపిఐ 99వ వార్షికోత్సవాలు ఎల్కతుర్తి మండల కేంద్రంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు లక్ష్మణ్ అధ్యక్షతన జరిగింది సిపిఐ మండల కార్య దర్శి ఊట్కూరి రాములు మాట్లాడుతూ, 19 25 డిసెంబర్ 26 సిపిఐ పార్టీ కాన్పూర్ లో పుట్టి 2025 డిసెంబర్ 26 కు 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంలో ప్రజలకు పోరాటాల ద్వారా లక్షలాది ఎకరాల సాగుభూమి పంచిన చరిత్ర సిపిఐ పార్టీకి ఉందని అన్నారు.
అదేవిధంగా తెలంగాణ రైతన్న సాయుధ పోరాటంలో అలుపెరుగని పోరాటం చేసి 4 500 మందిని బలిదానం చేసిన చరిత్ర సిపిఐ కి ఉంది ప్రజల సమస్యలపై ఉద్యమాలు పోరాటాలు చేస్తే ప్రజల మధ్య ఉండేది కమ్యూనిస్టు పార్టీ ప్రజల సమస్యలు ఎక్కడ ఉంటే కమ్యూనిస్టు పార్టీ అక్కడే ఉంటుందని ఆయన అన్నారు పోరాటాలు ఉదృతం చేసి ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకొని ఇండ్ల స్థానాలు వచ్చేవరకు పోరాటాలను ఉద్యమాలను ఉధృతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తక్షణమే కేంద్రమంత్రి వర్గం నుండి భర్తరపు చేయాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యాల ద్వారా భాజపా నిజ స్వరూపం బహిర్గతమైందని ఆయన్ని ప్రధాని మోదీ సమర్థించడం ద్వారా దేశానికి పరిపాలించే అర్హత కూల్ పోయిందని అంబేద్కర్ అంటే భారత రాజ్యాంగం అమలవుతుందని స్పష్ట చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యుడు కామర వెంకటరమణ మండల కార్యవర్గ సభ్యులు తండా మొండయ్య నిమ్మల మనోహర్ మర్రి విజయ్ సుర మొగిలి మరి పెళ్లి తిరుమల వేముల కుమారస్వామి గడ్డం రాజనర్సు పోచయ్య కొండ చరణ్ పెండ్యాల బన్నీ పెండ్యాల అర్జున్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు