లక్ష్మిపూర్ రైతులతో సిబిఐ మాజీ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ

On
లక్ష్మిపూర్ రైతులతో సిబిఐ మాజీ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ

లక్ష్మిపూర్ రైతులతో సిబిఐ మాజీ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ

గొల్లపల్లి డిసెంబర్ 17 ప్రజామంటలు
  
సిబిఐ మాజీ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ  రిటైర్డ్ ఏడిఏ అశోక్ కుమార్ తో కలసి లక్ష్మీపూర్ గ్రామంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా గ్రామ రైతులు పెద్ద ఎత్తున స్వాగతం పలికి మొదట లక్ష్మిపూర్ వెంకటేశ్వర స్వామి దర్శన అనంతరం స్థానిక లక్ష్మీపూర్ రైతు పరస్పర సహకార సంఘం, లక్ష్మీపూర్ రైతు ఉత్పత్తి దారుల సంఘం ఆఫీస్, గోదాములని పరిశీలించి అక్కడ రైతులు, స్థానిక సిబ్బందితో సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యాకలాపాల పై అడిగి తెలుసుకున్నారు, అనంతరం గ్రామ పంచాయితీ వద్ద సమావేశ చేశారు  ఈ సందర్బంగా లక్ష్మిపూర్ సహకార సంఘం చైర్మన్ పన్నాల తిరుపతి రెడ్డి  మాట్లాడుతూ రైతులందరం అశోక్ కుమార్  సూచనలతో ఒక్కో రైతు 2300 సభ్యత్వం తో 200 మందితో సంఘంగా ఏర్పడి నేడు 570 మంది రైతులు సభ్యులుగా ఒక్కో రైతు షేర్ విలువ సుమారు 23000 వరకు చేరింది,రైతులంతా కలసి విత్తన ఉత్పత్తి, సంఘం ఆధ్వర్యంలో ఒక ఫర్టిలైజర్, ఫెస్టిసైడ్ నడుపుతూ తక్కువ ధరకు ఎరువులు అందించడంతో పాటు, నాబార్డ్ నిధులతో ఒక గోదాము సైతం నిర్మించుకున్నాం, అదే విధంగా లక్ష్మీపుర్ బ్రాండ్ పేరుతొ రైతులు పండించిన దాన్యాన్ని బియ్యంగా చేసి వినియోగదారులకు అందించే ప్రయత్నం చేస్తూ, ఇక్కడి రైతుల సమస్యలపై పోరాడుతున్న సమయంలోగత ప్రభుత్వాలు కక్ష గట్టి రైతులని విచ్చిన్నం చేసే ప్రయత్నం చేసిన సందర్భాలు ఉన్నాయని అన్నారు,అనంతరం మాజీ ఏడిఏ అశోక్ కుమార్  మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో రైతులు సంఘాటీతం అయి ముందుకు వెలుతూ రైతులను పీడిస్తున్న అవినీతి అధికారులను ప్రశ్నిస్తూ ముందుకు వెళ్లాలని, రైతులను లంచాల పేరుతొ వేదిస్తున్న అధికారులకు ఇప్పుడు బాగున్నా ఎప్పుడో ఒకసారి ఆ ఉసురు తగులుతుందని పేర్కొన్నారు. ఈ సందర్బంగా ముఖ్య అతిధి జేడి లక్ష్మినారాయణ  మాట్లాడుతూ  స్థానిక రైతులు సంఘంగా ఏర్పడి ముందుకు వెళుతున్న తీరు ప్రశంసనీయం అని,దేశంలో ఆదర్శ గ్రామాలుగా ఉన్న అంకాపూర్, ములుకనూరు లకు దీటుగా లక్ష్మిపూర్ నిలుస్తుందని, ఇక్కడి రైతులు ఇంకా ముందడుగు వేసి తాము పండించిన పంటలను ఆహార ఉత్పత్తులుగా మార్చేందుకు ఫుడ్ ప్రాసేసింగ్ ఇండస్ట్రీ వైపు ద్రుష్టి సారించడం తో పాటు, సేంద్రియ వ్యవసాయం వైపు సాగి ఆహార ఉత్పత్తులను బయటి దేశాలకు ఎగుమతులు చేసే విధంగా ముందుకు వెళ్లాలని, నేటి యువత సైతం మద్యం, మొబైల్ మోజు నుండి బయటపడి వ్యవసాయ అనుబంధ రంగాలవైపు దృష్టి సారించాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమం లో యూత్ ఫర్ యాంటికరప్షన్ సంస్థ ప్రతినిధి రాజేందర్,రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షులు కొప్పర వెంకట్ రెడ్డి, చైతన్య హైస్కులు చైర్మన్ క్యాతం గంగారెడ్డి ,లక్ష్మీపూర్ సహకార సంఘం వైస్ ప్రెసిడెంట్ గర్వందుల చిన్న గంగయ్య, మాజీ వైస్ చైర్మన్ మామిడి తిరుపతి రెడ్డి , డైరెక్టర్ లు కొట్టాల మోహన్ రెడ్డి, నల్ల రాజేశ్వర్ రెడ్డి, గడ్డం లింగారెడ్డి, నాలువాల పోషయ్య ఏలేటి రాజిరెడ్డి, ఏలేటి స్వామి రెడ్డి, గడ్డం తిరుపతి, సంగెపు తిరుపతి, తీపిరెడ్డి తిరుపతి రెడ్డి, కాటిపెల్లి కుమార్, మనోహర్, తిరుపతి, గడ్డం రాజిరెడ్డి,జయంత్,తదితరులు పాల్గొన్నారు.

Tags

Latest Posts

ధ్యానం, యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం. - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
ఐఎమ్ఏ , రోటరీ క్లబ్, ఆపి ఆధ్వర్యంలో ఒమేగా సుశృత హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ -పాల్గొన్న DMHO .
తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్
జిల్లా సివిల్ జడ్జి మరియు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రెటరీ కే. ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ దివ్యాంగుల పట్టభద్రుల సంఘం నాయకులు
ప్రపంచ గణిత మేధావి రామానుజన్‌. - జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్.