దేశానికి అన్నం పెట్టే రైతులకు సంకెళ్ల...? దావా వసంత సురేష్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల డిసెంబర్ 17 (ప్రజా మంటలు)
తెలంగాణ రాష్ట్రంలో రైతన్నల పై జరుగుతున్న అరాచకాలను, అణిచివేతల నుంచి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరాచకాల నుంచి లగచర్ల రైతన్నలను కాపాడాలని జగిత్యాల తహసీల్ చౌరస్తాలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి జిల్లా బీఆర్ఎస్ నాయకులతో కలిసి వినతి పత్రం అందజేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్
ఈ సందర్భంగా దావ వసంత సురేష్ మాట్లాడుతూ, విన్నవించుకున్నారు....
- భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా రాజ్యాంగాన్ని కాలరాస్తోంది.
- అన్నిటికంటే ముఖ్యంగా దళిత గిరిజనులు ఈ రాజ్యాంగ వ్యతిరేక చర్యల వల్ల తీవ్రంగా అణిచివేతకు గురవుతున్నారు.
- పేద దళిత గిరిజన రైతులు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను బలవంతంగా లాక్కొని వారిని రోడ్డున పడేసే కుట్ర చేస్తోంది.
- ఈ కాంగ్రెస్ సర్కార్ రాజ్యాంగ వ్యతిరేకంగా అడుగడుగునా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలని, మీరు బుద్ధి చెప్పాలని కోరుకుంటూన్నాం.
- స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ లోని లగచర్లలో పేద రైతన్నల భూములను బలవంతంగా లాక్కునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నది.
- ఓసారి ఫార్మా విలేజ్ అని, మరోసారి ఇండస్ట్రియల్ కారిడార్ అని, మాయమాటలు చెప్తూ ఏదోలాగా రైతన్నల భూములను లాక్కొని ఆదానికి, తన అల్లుడికి అప్పజెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారు.
- తమ భూములను ఇవ్వమని తమ జీవనాధారాన్ని లాక్కోవద్దని ప్రభుత్వానికి పది నెలలుగా విజ్ఞప్తి చేసిన పట్టించుకోకుండా... నిరంకుశంగా, పాషవికంగా పేద రైతన్నల పైన మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరాచకాలను మీ దృష్టికి తీసుకువస్తున్నాము.
- కొడంగల్ నియోజకవర్గం తన జాగీరుగా భావిస్తూ... తన సోదరులతో పేద బడుగు బలహీన దళిత గిరిజన రైతుల పైన చేస్తున్న అరాచకాలను, అణిచివేతను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుల ఆదేశాల మేరకు పోలీసులు చేసిన థర్డ్ డిగ్రీ టార్చర్ ను మీ దృష్టికి తెస్తున్నాము.
- అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా రైతన్నలను జైలులో పెట్టి, రైతన్న చేతులకు బేడీలు వేసిన రాజ్యాంగ వ్యతిరేక చర్యలను, పోలీసుల అణిచివేతను వేధింపుల నుండి వారిని కాపాడాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాము.
- లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి, వారిపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించి, రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ, అమానవీయ, అణిచివేత విధానాలకు నిరసనగా... రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి, వారిని వెంటనే విడుదల చేయాలని, రైతన్నల కుటుంబాలను వేధించడం హింసించడం ఆపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సద్భుద్ధిని ప్రసాదించాలని, ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించాలని రాజ్యాంగ నిర్మాత అయిన మీకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గట్టు సతీష్, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం ప్రియాంక ప్రవీణ్, అర్బన్ రూరల్ మండల ఆధ్యక్షులు తుమ్మ గంగాధర్,ఆనందరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆనందరావు, పట్టణ ఉపాధ్యక్షులు వోల్లం మల్లేష్, బిఆర్ఎస్ కౌన్సిలర్లు దేవేందర్ నాయక్, అవారి శివకేశరీ బాబు, నాయకులు ఎల్లాల దామోదర్ రావు, చిట్ల రమణ , వెంకటేశ్వరావు, గంగా రెడ్డి, హరీష్, సనీత్ రావు, ప్రణయ్, నగేష్, ప్రతాప్ గంగ రెడ్డి,భగవన్ సాయి చింతల గంగాధర్, రిజ్వాన్, నక్క గంగాధర్, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.