ధనురాసోత్సవాలకు వేదిక అయిన ధర్మపురి క్షేత్రం 

On
ధనురాసోత్సవాలకు వేదిక అయిన ధర్మపురి క్షేత్రం 

ధనురాసోత్సవాలకు వేదిక అయిన ధర్మపురి క్షేత్రం 
డిసెంబర్ 16 నుండి ఉష: కాల పూజలు
ప్రారంభం

(రామ కిష్టయ్య సంగన భట్ల...
   9440595494)

 గోదావరీ తీరస్థ ప్రాచీన పుణ్య తీరమైన ధర్మపురి క్షేత్రం ధనుర్మాస ఉత్సవ వేడుకలకు వేదిక అయింది. దేవస్థానంలో ఉగ్ర, యోగానంద లక్ష్మీ సమేత నరసింహ, శ్రీ వేంకటేశ్వర దేవాలయాలతో పాటు గోదావరీ తీరస్త  శ్రీరామాలయం, సంతోషి మాత, సాయి బాలాజీ మందిరాలలో ఈ నెల 16వ తేదీనుండి జనవరి 14వరకు నెల రోజుల పాటు నిర్వహించనున్న  ధనుర్మాస ప్రత్యేక ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు గావిస్తున్నారు. చైత్ర, వైశాఖ మాసములు, పాడ్యమి, విదియాది తిధులను చాంద్ర మానమును అనుసరించి లెక్కించడం జరుగుతుంది. ఔత్తరాహికులు బార్హస్పత్య మానమును అనుసరిస్తే, దక్షిణాత్యులు సౌర మానమును పాటించడం పరిపాటి. సూర్యోదయాస్తమయాదులు సౌర మానమునకు ఆధారములు. సూర్యుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించి, ఉండు నెల రోజులు అయా మాసములుగా గుర్తించ బడినవి. ఒక్కొక్క మాసము ఒక్కొక్క సంక్రాంతిగా చెప్పబడు చున్నది. నాగర ఖండ ప్రమాణము గానే మకర సంక్రాంతి (జనవరి 14) మొదలు కొని కర్కాటక సంక్రాంతి (జాలై 10) వరకు ఉత్తరాయణము, తదాది మరల మకర సంక్రాంతి వరకు దక్షిణాయనముగా చెప్ప బడింది. ఇది మానవులు అనుసరించు కాలము కాగా, మానవులకు ఒక సంవత్సర ప్రమాణ కాలము దేవతలకు ఒక అహోరాత్రమైన దివసముగా పేర్కొన బడినది. అందున ఉత్తరాయణము దినము కాగా, దక్షిణాయణము రాత్రి భాగమగుచున్నది. ధనుస్సంక్రమణమైన మాసము దేవతలకు ఉష:కాలముగును. అందుకే బ్రాహ్మీ ముహూర్తము నందు మేల్కొనాలి. అదే ప్రకారం దేవతలకు కూడా ధనుర్మాసం బ్రాహ్మీ ముహూర్త కాల మగు చున్నది. ఇట్టి సమయాన దేవతార్చన చాలా విశిష్టమైనదని స్పష్టమగు చున్నది. ముల్లోకాధిపతి యైన మహా విష్ణువు ఆషాఢము మొదలుకుని కార్తీకము వరకు నిదురించునని అట్టి భగనుని  సూర్యుడు ధనుర్రాశి లో ప్రవేశించిన పిదప విష్ణు సంబంధమైన స్తోత్రాలతో  మేల్కొలిపి , ఉష: కాల మందు శోడపోపచారములచే పూజించి, ముద్గాన్నము (పులగం), పొంగలి, చక్కెర పొంగలి)  నివేదనం చేయాలి. సూర్యోదయం కన్నా ముందే ఉష: కాలమున అరుణోదయ సమయమున విష్ణుమూర్తిని నెల రోజులు పూజించాలని, అరుణోదయము అనగా ఉదయమునకు పూర్వము నాలుగు ఘటియలని,  ఒక ఘటియ ఇరువది నాలుగు నిమిషములని, గంటన్నర పూర్వముగా స్కంద పురాణం వివరిస్తున్నది. ఈ నేపధ్యంలో ధర్శపురి క్షేత్ర విష్ణు సంబంధ ఆలయాలలో ఆనాదిగా, ధనుర్మాస ప్రత్యేక కార్యక్రమాలు ఆచరించడం సత్సంప్రదాయంగా మారింది. నెల రోజుల పాటు ఉదయాత్పూర్వం వివిధ ఆలయాలలో అభిషేకాలు, అర్చనలు, పూజలు, నిత్య కళ్యాణ సేవలను నిర్వహించేందుకు వలసిన ఏర్పాటును గానిస్తున్నారు. జనవరి 10
న వైకుంఠ ఏకాదశి తదితర ఉత్సవాలు, రంగ నాథుల కళ్యాణాది కార్యక్రమాలను ఘనంగా నిర్వహించ నున్నారు.

 సీతారామాలయంలో వేడుకలు

సనాతన సాంప్రదాయాల సరియైన గోదావరి తీరాన ధర్మపురి క్షేత్రంలో డిసెంబర్ 16వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు నెల రోజుల పాటు నిర్వహించనున్న ధనుర్మాసోత్సవ వేడుకల కోసం గోదావరి నది తీరాన వెలసిన శ్రీరామాలయంలో ప్రత్యేక ఏర్పాటు గావించారు. దక్షిణాభిముఖియై ప్రవహిస్తూ, విశేష ప్రాధాన్యతను సంతరించుకున్న పరమ పావనమైన గోదావరి నది తీరాన వెలసిన క్షేత్రంలోని అతి ప్రాచీన రామాలయంలో ధనుర్మాస ఉత్సవాలను ఏటా  ఘనంగా నిర్వహిస్తున్న క్రమంలో ఆలయ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లను గావించడంలో నిర్వాహకులు నిరంతర నిమగ్న మైనారు. శ్రీరామాలయంలో దేశంలో వేరెచ్చటా లేని విధంగా, నల్ల శనపు రాతిపై సమంశ పద్ధతిలో చెక్క బడిన శ్రీరామ చంద్ర మూర్తికి మీసాలుండడం ఈ కోవెల విశేషం. పూర్వాభిముఖులైయున్న సీతారామ ఏక శిలా విగ్రహం, ప్రభపై దశావతారాలు, చత్రదారిగా భరతుడు, వింజామర వీస్తూ శత్రుజ్ఞుడు, అనంత పద్మనాభ స్వామి, ఇరువురు దేవేరులతో కూడిన వేంకటేశ్వర, శివ పంచాయ తనాలతో శోభీల్లుతున్నది దేవాలయం. సూర్యుడు దనుర్రాశి లో  ప్రవేశించి, ధను సంక్రమణం కలుగు తున్నందున, దేవస్థాన పండిత వర్గ నిర్ణయం మేరకు 16వ తేదీ నుండి నెల రోజుల పాటు ఈ ఆలయంలో  ఉత్సవాలు నిర్వహించ డానికి  వలసిన ఏర్పాట్లు చేశారు. వంశ పారంపర్య అర్చకులు,  జ్యోతిష్కులు దివంగత తాడూరి శివ రామయ్య ప్రారంభించి, రాష్ట్ర ఇతర  ప్రాంతాలలో పురాణ ప్రవచనాలతో శిష్య  సాంప్రదాయాన్ని కలిగిన కీర్తి శేషులు తాడూరి బాలకృష్ణ శాస్త్రి కొన సాగించిన, ఉత్సవాలను ఏటా   ఘనంగా సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించడం ఆనవాయితి.

దేవస్థానం వేళల్లో మార్పులు

డిసెంబర్ 16న సాయంత్రం ధనుర్మాసం ప్రారంభం కానున్నందున ధర్మపురి క్షేత్రంలో ఈనెల 16వ తేదీ నుండి విష్ణు సంబంధ ఆలయాలలో నెల రోజులపాటు ఉదయాత్పూర్వం నిర్వహించనున్న ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా సంబంధిత ఆలయాల వేళలలో మార్పులు చేయనున్నట్లు చేస్తున్నట్లు  కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

మార్గశిర మాసం ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా డిసెంబర్ 16వ తేదీ ప్రారంభమై జనవరి14 వరకు ప్రతినిత్యం ఉదయం 3-00 గంటలకు దేవాలయం తెరచి 3-45 గంటలకు అన్ని దేవాలయంలలో అబిషేకం ప్రారంభించబడునని, అలాగే 8-00 గంటలనుండి 2-30 గంటలవరకు అర్చనలు, హారతి టికెట్లు భక్తులకు ఇవ్వబడునని, తిరిగి 4-౦౦ గంటలనుండి రాత్రి 6-00 గంటల వరకు అర్చనలు, హరతి టికెట్స్ భక్తులకు ఇవ్వబడునని తెలిపారు. సాయంత్రం 6-00 గంటలనుండి రాత్రి 7-00 గంటల వరకు స్వామి వారికి ఆరాధన, నివేదన కార్యక్రమంలు చేసి దేవాలయం మూసివేయ బడునని ఈఓ శ్రీనివాస్ వివరించారు.

Tags

More News...

Local News  State News 

సూపర్ పోలీస్.వేములవాడలో బాలిక కిడ్నాప్ ను చేధించిన రాజన్న సిరిసిల్ల పోలీసులు

సూపర్ పోలీస్.వేములవాడలో బాలిక కిడ్నాప్ ను చేధించిన రాజన్న సిరిసిల్ల పోలీసులు సూపర్ పోలీస్.వేములవాడలో బాలిక కిడ్నాప్ ను చేధించిన రాజన్న సిరిసిల్ల పోలీసులు రాజన్న సిరిసిల్ల జనవరి 08: వేములవాడలో బాలిక కిడ్నాప్ ను రాజన్న సిరిసిల్ల పోలీసులు వేగంగా చేధించారు..   ఎస్పీ అఖిల్ మహాజన్ వ్యూహంతో ఫలించిన పోలీసులు స్పెషల్ ఆపరేషన్. గత 10 రోజులుగా శ్రమించి పాప ఆచూకీ  పోలీసులు.కనుగొన్నారు.జిల్లాలో సంచలనంగా మారిన అధ్విత...
Read More...
Today's Cartoon 

Today's cartoon

Today's cartoon Today's Cartoon 
Read More...
Local News 

గొల్లపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సైబర్ క్రైమ్ మరియు రోడ్ సేఫ్టీ పై అవగాహన సదస్సు

గొల్లపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సైబర్ క్రైమ్ మరియు రోడ్ సేఫ్టీ పై అవగాహన సదస్సు గొల్లపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలోసైబర్ క్రైమ్ మరియు రోడ్ సేఫ్టీ పై అవగాహన సదస్సు గొల్లపల్లి జనవరి 08 (ప్రజా మంటలు):   జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  ఆదేశాల మేరకు  జాతీయ రోడ్డు భద్రత  సందర్భంగా గొల్లపల్లి  మండల కేంద్రంలో  జూనియర్ కళాశాల లో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ అంతేకాకుండా...
Read More...
Local News 

గంజాయి అమ్ముతున్న వ్యక్తిని పట్టుకొని కేసు నమోదు చేసిన పోలీసులు

గంజాయి అమ్ముతున్న వ్యక్తిని పట్టుకొని కేసు నమోదు చేసిన పోలీసులు గంజాయి అమ్ముతున్న వ్యక్తిని పట్టుకొని, కేసు నమోదు చేసిన పోలీసులు    గొల్లపల్లి జనవరి 07( ప్రజా మంటలు)    గొల్లపల్లి మండలం లోని లోత్తునూరు గ్రామంలో జగిత్యాల కు చెందిన సాయికుమార్ 26 సం"వద్ద నుండి 270 గ్రాముల గంజాయి ని స్వాధీన పరుచుకొని, వ్యక్తిపై కేసు నమోదు చేసిన గొల్లపెల్లి ఎస్ఐ, సతీష్ ఈఎవరైనా...
Read More...
Local News 

విద్యార్థులకు రోడ్డు భద్రత గూర్చి అవగాహన సదస్సు

విద్యార్థులకు రోడ్డు భద్రత గూర్చి అవగాహన సదస్సు విద్యార్థులకు రోడ్డు భద్రత గూర్చి అవగాహన సదస్సు ఇబ్రహీంపట్నం  జనవరి 07 (ప్రజా మంటలు):   ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇబ్రహీంపట్నం యందు రోడ్డు భద్రత మాషోస్తావాల్లో భగంగా ఇబ్రహీంపట్నం సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీ అనిల్ కుమార్  పాఠశాల  విద్యార్థి, విద్యార్థినులకు రహదారి భద్రత నియమాలు, నిబంధనాల గురించి వివిధ అంశాలపైనా అవగాహన కార్యక్రమం నిర్వహించడం
Read More...
Local News  State News 

ప్రయాణికుల భధ్రతే లక్ష్యంగా వాహనాలు నడపాలి. - జిల్లా రవాణాశాఖధికారి శ్రీనివాస్.

ప్రయాణికుల భధ్రతే లక్ష్యంగా వాహనాలు నడపాలి. - జిల్లా రవాణాశాఖధికారి శ్రీనివాస్. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల జనవరి 7(ప్రజా మంటలు ) :  ఓవర్ స్పీడ్, నిర్లక్ష్య డ్రైవింగ్ అనే మానవ తప్పిదాల వల్లనే రోడ్డు ప్రమాధాలు జరుగుతున్నాయని వీటిని అరికట్టాల్సిన బాధ్యత డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరిపై ఉందని జగిత్యాల జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ అన్నారు. జాతీయ రోడ్డు...
Read More...
Local News  State News 

సఖి కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్.

సఖి కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  జగిత్యాల జనవరి 7 (ప్రజా మంటలు) :  జిల్లా "తేజస్ ఫౌండేషన్ ట్రస్ట్" నిర్వహిస్తున్న సఖి - కేంద్రము - జగిత్యాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తదుపరి సఖి సెంటర్లో రిజిస్టర్లని తనిఖి చేస్తూ క్లిస్టమైన కేసులను గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే మహిళలు...
Read More...
Local News 

కదిలెల్లిన సార్లు - విద్యార్థుల అడ్మిషన్ల కోసం అధ్యాపక బృందం ఊరూరా ప్రచారంకు శ్రీకారం 

కదిలెల్లిన సార్లు -  విద్యార్థుల అడ్మిషన్ల కోసం అధ్యాపక బృందం ఊరూరా ప్రచారంకు శ్రీకారం  (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9964349493/9348422113).  జగిత్యాల జనవరి 7 (ప్రజా మంటలు) :  ఈ 2025-26 విద్యా సంవత్సరంలో కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడానికిగాను కళాశాల ప్రిన్సిపాల్ డా. అరిగెల అశోక్ ఆధ్వర్యంలో, వైస్ ప్రిన్సిపాల్ డా.ఆడెపు శ్రీనివాస్, అధ్యాపక బృందం పట్టణ మరియు సమీప గ్రామాలలో గ్రామీణ పేద మరియు వెనుకబడిన...
Read More...
Local News  State News 

 జిల్లా పరిధిలో పోగొట్టుకున్న, చోరికి గురైన 120 మొబైల్ ఫోన్లను ( సుమారు 18 లక్షల విలువగల ) బాధితులకు అందజేత.

 జిల్లా పరిధిలో పోగొట్టుకున్న, చోరికి గురైన 120 మొబైల్ ఫోన్లను ( సుమారు 18 లక్షల విలువగల ) బాధితులకు అందజేత. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల జనవరి 7 (ప్రజామంటలు) :  సెల్ ఫోన్ పోయిన, చోరీకి గురైన ఆందోళన చెందవద్దని CEIR ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో పోగొట్టుకున్న, చోరి గురైన 120 మొబైల్ ఫోన్లను (...
Read More...
National  International   State News 

సినీ నటుడు అజిత్ కారు రేస్ ప్రాక్టీస్ లో ప్రమాదం

సినీ నటుడు అజిత్ కారు రేస్ ప్రాక్టీస్ లో ప్రమాదం సినీ నటుడు అజిత్ కార్ రేస్ ప్రాక్టీస్ లో ప్రమాదం  చెన్నై జనవరి 07: నటుడు అజిత్ కారు ప్రమాదం నుండి బయటపడ్డారు.దుబాయ్‌లో కార్ రేస్ ప్రాక్టీస్ సందర్భంగా నటుడు అజిత్ కుమార్ కారు ప్రమాదానికి గురైంది.కారు ప్రమాదం నుంచి బయటపడ్డ అజిత్ క్షేమంగా ఉన్నట్లు సమాచారం.
Read More...
Local News  State News 

అపశృతులు లేకుండా ఉత్సవాలు జరపండి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ 

అపశృతులు లేకుండా ఉత్సవాలు జరపండి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్  అపశృతులు లేకుండా ఉత్సవాలు జరపండిప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ (రామ కిష్టయ్య సంగన భట్ల)ధర్మపురి జనవరి 07:   ధర్మపురి దేవస్థానంలో ఈనెల 10న శుక్ర వారం నిర్వహించనున్న ముక్కోటి (వైకుంఠ) ఏకాదశి ఉత్సవాన్ని భక్తు లకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా, అపశృతులు లేకుండా నిర్వహించడంపై ప్రత్యేక దృష్టి నిలపాలని, అందుకు సంబంధిత  విప్...
Read More...
National  State News 

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు, ఫిబ్రవరి 5న ఓటింగ్, 8 న ఫలితాలు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు, ఫిబ్రవరి 5న ఓటింగ్, 8 న ఫలితాలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు,  ఫిబ్రవరి 5న ఓటింగ్, 8 న ఫలితాలు న్యూ ఢిల్లీ జనవరి 07: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో ఫిబ్రవరి 5న జరుగుతాయని ఎన్నికల సంఘం ప్రకటించింది, ఫిబ్రవరి 8న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడంతో, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) అమల్లోకి...
Read More...