పుస్తక పఠనంతో విజ్ఞానం పెంపొందుతుంది : - జగిత్యాల డిఎస్పీ రఘుచందర్, 

On
పుస్తక పఠనంతో విజ్ఞానం పెంపొందుతుంది :  - జగిత్యాల డిఎస్పీ రఘుచందర్, 

పుస్తక పఠనంతో విజ్ఞానం పెంపొందుతుంది - జగిత్యాల డిఎస్పీ రఘుచందర్, 

నవచేతన  సంచార పుస్తకాలయం  ప్రారంభించిన డిఎస్పీ

గొల్లపల్లి డిసెంబర్ 12 (ప్రజా మంటలు):

పుస్తక పఠనంతో విజ్ఞానం పెంపొంతుందని జగిత్యాల డిఎస్పీ రఘుచంధర్ అన్నాను. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోలీసు స్టేషన్  వద్ద నవచేతన విజ్ఞాన సమితి వారి సంచార పుస్తకాలయం ప్రదర్శనను జగిత్యాల జిల్లా ప్రజపక్షం ప్రతినిధి, జగిత్యాల  ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణ సీఐ ఎస్.వేణుగోపాల్ తో కలసి జగిత్యాల డిఎస్పీ  రఘు చందర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా డిఎస్పీ  రఘుంచందర్ మాట్లాడుతూ, పుస్తకాలు చదవడం వల్ల కొత్త విషయాలు తెలుసుకోవచ్చని చెభుతూ, ప్రతి ఒక్కరు పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలన్నారు. ప్రపంచంలో జరుగుతున్నా, జరిగిన విషయాలు, వ్యక్తిత్వ వికాసం, చైతన్యానికి సంబందించిన అన్నిటికి మూలాధారం  పుస్తకమేనని  పేర్కొన్నారు. పుస్తకాలు చదవడం ద్వారా ప్రపంచ విజ్ఞానం తెలుసుకోవచ్చని, పుస్తకాలు ప్రతి మనిషిని ఉత్తమంగా తీర్చిదిద్దుతాయని, ప్రపంచ విజ్ఞానాన్ని పెంపొందిస్తాయని, మంచి నడవడికని నేర్పుతాయన్నారు.
ఈ మధ్యకాలంలో ప్రజలు సెల్ పోన్ మోజులో పడి పుస్తకాలు చదవడంలో చాలా వెనుకబడి పోతున్నారని, వాస్తవంగా ఒక సెల్ ఫోన్ లో 30 శాతం సమాచారం మాత్రమే ఉంటుందని, పుస్తకాల  ద్వార వంద శాతం సమాచారం తెలుసుకోవచ్చని స్పష్టం చేశారు. ప్రజలకు, పాఠకులకు వినోదానికి, విజ్ఞానానికి ఎంతగానో ఉపయోగపడే పుస్తకాలు ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్లి తెచ్చుకునే ఇబ్బంది కలగకుండా జగిత్యాల జిల్లా కేంద్రానికి విచ్చేసి మనకు కావాల్సిన పుస్తకాలను పాఠకులకు అందిస్తున్నందుకు నవచేతన విజ్ఞాన సమితి వారిని అభినందిస్తున్నామనీ డిఎస్పీ చెప్పారు.
ఈ సందర్భంగా నవచేతన విజ్ఞాన సమితి సంచార పుస్తకాలయంలో విజ్ఞానం, వినోదం, సైన్స్, సాహిత్యం, బాలల కథలు, నవలలు, గణితం, ఆధ్యాత్మికం, పర్సనాలిటీ, సాంకేతికత, సామాజిక అంశాలకు చెందిన పుస్తకాలు పిల్లలకు, పెద్దలకు ప్రతీ ఒక్కరికీ ఎంతగానో విజ్ఞానాన్ని అందించే పుస్తకాలు ఇందులో లభిస్తాయనీ రఘుచంధర్ వివరించారు.

జగిత్యాల ప్రజలు, యువకులు, ఉద్యోగులు, సాహితీవేత్తలు, మేధావులు పుస్తాకలయానికి వెళ్లేందుకు డిసెంబర్ 15  వరకు  పట్టణంలో ప్రజలకు అందుబాటులో ఉంటుందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని డీఎస్పీ సూచించారు.  
ఈ కార్యక్రమంలో పాత్రికేయులు సంపత్ కుమార్, సిరిసిల్ల వేణుగోపాల్, పులి నర్సయ్య,బిసి విద్యార్థి సంఘం అధ్యక్షుడు వంశి, నవచేతేన విజ్ఞాన సమితి సంచార పుస్తకాలయ ఇంచార్జి సి.హెచ్. గోపాలకృష్ణ, అసిస్టెంట్ జి.ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Tags