బి బి కే ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్ల పంపిణీ

On
బి బి కే ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్ల పంపిణీ

బి బి కే ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్ల పంపిణీ 

గొల్లపల్లి డిసెంబర్ 11 (ప్రజా మంటలు):

నిరుపేదలకు తోచిన రీతిన సాయ మందించడంలోనే ఆత్మసంతృప్తి కలుగుతుందని, ఎంత సంపాదించామన్న దానికంటే ఎందరికి సాయం చేశామన్నదే ముఖ్యమని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సతీమణి కాంత కుమారి  అన్నారు.

జగిత్యాల లోని శివ గాయత్రి,విశ్వ గాయత్రి వృద్ధ  ఆశ్రమంలో ఏర సాని శ్రావణ్ కుమార్ జన్మదిన సందర్భంగా భీమ్ రాజ్ పల్లి బొమ్మెన కుమార్ ( బి బి కే ) ఆధ్వర్యంలో   70 మంది నిరుపేదలకు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సతీమణి కాంత కుమారి దుప్పట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయా ఆశ్రమాల్లో  ఆమె మాట్లాడుతూ మాట్లాడుతూ పలు సేవా కార్యక్రమాలద్వారా ఎంతోమంది యువతకు బి బి కే ఫౌండర్ బొమ్మెన కుమార్ స్ఫూర్తిగా నిలుస్తున్నారని ఆయన పేదలకు చేస్తున్న సేవల పట్ల అభినందించారు. ఈ కార్యక్రమంలో బి బి కే ఫౌండర్ బొమ్మెన కుమార్ మాధవి దంపతులు, వృద్ధాశ్రమ అధ్యక్షులు ఎలుమిల్లి సత్తయ్య, సూర్యం, శ్రీకాంత్, మేనేజర్ రోహిణి,ఎలగందుల రూపేష్, ముక్తామని తదితరులు పాల్గొన్నారు

Tags