గొల్లపల్లి మండలానికి దక్కిన అరుదైన గౌరవం 

On
గొల్లపల్లి మండలానికి దక్కిన అరుదైన గౌరవం 

గొల్లపల్లి మండలానికి దక్కిన అరుదైన గౌరవం 

గొల్లపెల్లి డిసెంబర్ 10 (ప్రజా మంటలు):

దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్  అండ్ ఇండస్ట్రీ సంస్థ  జగిత్యాల జిల్లా సమన్వయ కర్తగా రాపల్లి గ్రామానికి చెందిన నల్ల శ్యామును నియమించిన సందర్భంగా,  గొల్లపల్లి మండల పరిషత్ ఆవరణలో  ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు ఆయనకు ఘన స్వాగతం తెలిపి  శాలువతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా దళిత ఇండస్ట్రీలో దళితులు అభివృద్ధి పథంలో ముందుకు  వెళ్లడానికి ఈ సంస్థ ఎంతో దోహదపడుతుందని అన్నారు. ఇలాంటి గొప్ప అరుదైన అవకాశాన్ని మా  మండలానికి చెందిన మల్ల శ్యామును కోఆర్డినేట్ గా నియమించడం అభినందనీయమని పేర్కొన్నారు. 

అనంతరం నల్ల శ్యామ్ మాట్లాడుతూ, మనిషి ఎదుగుదలలో ముఖ్య భాగమైన సాంఘిక, రాజకీయ, ఆర్థిక రంగాలలో ఒకటైన ఆర్థిక రంగంలో, డిక్కీ సంస్థ గత 20 సంవత్సరాలుగా పద్మశ్రీ మిలింద్ కాంబ్లి  2005 సంవత్సరంలో మహారాష్ట్రలోని పూణే వేదికగా స్థాపించడం జరిగింది. ఆ తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత, అనగా 2010లో, పద్మశ్రీ రవి కుమార్ నర  అప్పుడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోని ఈ సంస్థను స్థాపించారు. ఇలాంటి మహోన్నత సంస్థలో నేను సేవ చేయడానికి అవకాశం పొందడం నాకు ఎంతో సంతోషంగా ఉంది నన్ను నమ్మి ఇంత గొప్ప బాధ్యతను నా మీద ఉంచిన పద్మశ్రీ రవి కుమార్ నరకి, జాతీయ అధ్యక్షులు డిక్కీ, రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ దాసరి మేడమ్కి, రాష్ట్ర కోఆర్డినేటర్ నారాయణ దాసరి కి, మరియు రాష్ట్ర ముఖ్య కార్యవర్గానికి  ప్రత్యెక కృతజ్ఞతలు తెలిపారు. మీ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో వమ్ము చేయకుండా, జిల్లాలోని అన్ని విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ జిల్లా లోని దళితుల ఆర్థిక అభివృద్ధి కొరకు నా వంతు బాధ్యతను నిర్వర్తిస్తానని అని అన్నారు. జిల్లా కేంద్రంలో నన్ను ఘనంగా సన్మానించిన వివిధ సంఘాల, సామాజిక బాధ్యులందరికి పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చందోలి పి ఎ సి ఎస్ చైర్మన్ మాధవరావు తిరుపతి , తాజా మాజీ జెడ్పిటిసి గోస్కుల జలంధర్ , తాజా మాజీ ఎంపీపీ నక్క శంకరయ్య, మండల మండల పార్టీ అధ్యక్షులు బొల్లం రమేష్ , సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షులు గంగారెడ్డి , వైస్ ఎంపీపీ ఆవుల సత్తయ్య , అంబేద్కర్ సంఘం అధ్యక్షులు పొన్నగంటి రత్నయ్య, భోజనం శ్రీనివాస్ , మ్యాదరి రమేష్ గంగస్వామి, తాజా మాజీ మార్కెట్ చైర్మన్ హనుమాన్లు, తాజా మాజీ సర్పంచులు రవి సత్తన్న, కిషన్, రజక సంఘం అధ్యక్షులు సత్తాన్న, నాయకులు రవీందర్, రాకేష్, వీరస్వామి, లింగారెడ్డి , గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు

Tags