అభ్యుదయ భావాలు కలిగిన మేధావి నందిని సిద్దారెడ్డి గారు మీకు ఇది తగునా...?

రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి 

On
అభ్యుదయ భావాలు కలిగిన మేధావి నందిని సిద్దారెడ్డి గారు మీకు ఇది తగునా...?

అభ్యుదయ భావాలు కలిగిన మేధావి నందిని సిద్దారెడ్డి గారు మీకు ఇది తగునా...?

తెలంగాణ తల్లి విగ్రహంపై దిగజారి మాట్లాడడం సరికాదు 

నందిని సిద్ధారెడ్డి గారు మీ ఆరోపణలు విరమించుకోవాలి

దేవతలు, ప్రజలకు ప్రతిరూపం తెలంగాణ తల్లి విగ్రహం 

తెలంగాణ తల్లి విగ్రహం ప్రజలను ఆశీర్వధిస్తున్నట్లుగా గొప్పగా ఉంది 

## రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి 

హైదరాబాద్ డిసెంబర్ 09:

తెలంగాణ తల్లి విగ్రహంపై ప్రముఖ రచయిత, కవి, అభ్యుదయ భావాలు కలిగిన గొప్ప వ్యక్తి నందిని సిద్ధారెడ్డి  దిగజారి మాట్లాడడం ఆయన స్థాయికి తగదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి అన్నారు.IMG-20241209-WA0010సోమవారం అంబేద్కర్ సచివాలయం మీడియా సెంటర్ లో విలేకరులతో చిన్నారెడ్డి మాట్లాడారు.తెలంగాణ తల్లి విగ్రహంపై  రాద్ధాంతం చేయడం నందిని సిద్ధారెడ్డి గారికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని, ఆరోపణలను సిద్దారెడ్డీ వెంటనే ఉపసంహరించుకోవాలని చిన్నారెడ్డి సూచించారు.

దేవతలు, ప్రజలకు ప్రతిరూపం తెలంగాణ తల్లి విగ్రహం అని, అంత గొప్ప విగ్రహాన్ని విపక్షాలు వంకలు తీయడం శోచనీయమని చిన్నారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏ దేవతా విగ్రహాన్ని గమనించినా భుజం కింది నుంచి చేతితో ఆశీర్వదిస్తున్నట్టుగానే ఉంటాయని, తెలంగాణ తల్లి విగ్రహం కూడా అలాగే ఉందని చిన్నారెడ్డి పేర్కొన్నారు. అందుకు దేవతా విగ్రహాల చిత్రాలను ఆయన ప్రదర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాలలో ప్రతిష్టించినున్నట్లు ఆయన తెలిపారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజ మోహన్ కూడా పాల్గొన్నారు.

Tags