ఆలయాలను తొలగించమనడం సరికాదు.. * రైల్వే శాఖ పై ఎమ్మెల్యే ఆగ్రహం
ఆలయాలను తొలగించమనడం సరికాదు..
* రైల్వే శాఖ పై ఎమ్మెల్యే ఆగ్రహం
సికింద్రాబాద్ డిసెంబర్ 08 (ప్రజామంటలు):
రైల్వే అధికారుల తీరుపై మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేట లో గల హమాలీబస్తీ లోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం, ఫంక్షన్ హాల్ లను , రైల్ కళారంగ్ సమీపంలో గల నల్ల పోచమ్మ దేవాలయం లను రైల్వే శాఖ కు చెందిన స్థలంలో నిర్మించారని, వెంటనే ఖాళీ చేయాలని రైల్వే అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజలు ఆదివారం వెస్ట్ మారేడ్ పల్లి లోని కార్యాలయంలో MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి రైల్వే అధికారులు ఇచ్చిన నోటీసులు చూపారు. సుమారు 123 సంవత్సరాల క్రితం వెలసిన ఆంజనేయస్వామి కి ఆలయాన్ని నిర్మించి నాటి నుండి పూజలు నిర్వహిస్తూ వస్తున్నామని వివరించారు. నల్ల పోచమ్మ దేవాలయం లో కూడా ఎన్నో సంవత్సరాల నుండి పూజలు జరుపుతున్న విషయాన్ని తెలిపారు. ఇప్పుడు రైల్వే అధికారులు తమ స్థలం ఖాళీ చేయాలని చెప్పడం పట్ల తమ ఆవేదనను వ్యక్తం చేశారు. స్పందించిన. MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రైల్వే అధికారులు వ్యవహరిస్తున్న విధానం సరైనది కాదన్నారు. వెంటనే రైల్వే అధికారులకు లేఖ రాస్తానని చెప్పారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని, వెంటనే తమ నిర్ణయాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు తమ తీరును మార్చుకోకుంటే ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. MLA ను కలిసిన వారిలో హమాలీబస్తీ కి చెందిన నాయకులు సుభాష్, కుషాల్, సత్తి, రవి కుమార్, అంజయ్య, నర్సింగ్ రావు పాల్గొన్నారు.