మల్లికార్జున స్వామి దొంగ మల్లన్న జాతర దండి వారం ప్రారంభం
మల్లికార్జున స్వామి దొంగ మల్లన్న జాతర దండి వారం ప్రారంభం
గొల్లపల్లి డిసెంబర్ 07 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలం మల్లన్న పేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి దొంగ మల్లన్న జాతర శనివారం దండి వారం భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్ట బందోబస్తును ఎస్సై చిర్ర సతీష్ ఏర్పాటు చేశారు.
భక్తులు, బోనాలు గిడి చుట్టు ప్రదక్షిణ చేసి స్వామి కి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ రామ్ నరసింహ రెడ్డి ఆలయ ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ రాజమౌళి స్వామివారి నీ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారి తీర్థప్రసాదాలు ఆలయ కమిటీ. అందజేశారు సుమారు 12000 భక్తులు దర్శనం చేసుకున్నట్టు మరియు టికెట్ల ద్వారా ఆదాయం 65670 రూపాయలు సమకూరినట్టు ఆలయ ఈవో విక్రమ్ గౌడ్ మరియు ఫౌండర్ ట్రస్ట్ శాంతయ్య తెలిపారు.