లౌడ్ స్పీకర్ల సౌండ్. - ఇమామ్ కి రెండు లక్షల జరిమానా
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
యూపీ, సంభాల్ డిసెంబర్ 15 (ప్రజా మంటలు) :
సంభాల్ లోని ఓ మసీదుకి చెందిన ఇమామ్ కి 2 లక్షల జరిమానా విధించారు అధికారులు.
నిబంధనలకు విరుద్ధంగా లౌడ్ స్పీకర్ల సౌండ్ ను అధికంగా పెట్టినందుకు అధికారులు ఈ భారీ జరిమానా విధించారు.
కోట్ గర్వి ప్రాంతంలోని అనార్ వలీ మసీదులో ఈ ఘటన జరిగింది. అనార్ వలీ మసీదులో స్పీకర్ల సౌండ్ అధికంగా పెడుతున్నారని ఫిర్యాదులు అందాయి.
దీంతో అక్కడి ఇమామ్ తహజీబ్ కి 2 లక్షల జరిమానా విధించి, బెయిల్ మంజూరు చేసినట్లు సంభాల్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ వందనా మిశ్రా వెల్లడించారు.
‘‘మసీదులో లౌడ్ స్పీకర్ల సౌండ్ అధికంగా పెడుతున్నారు. దీంతో చర్యలు తీసుకున్నాం. ఇమామ్ తహజీబ్ కి 2 లక్షల జరిమానా విధించారు. బెయిల్ కూడా మంజూరు చేశాం’’ అని అధికారులు తెలిపారు.
మరో ఆరు నెలల పాటు ఇలాంటి చర్యలకు దూరంగా వుండాలని ఇమామ్ ని అధికారులు ఆదేశించారు.