సికింద్రాబాద్​ లో రైల్వే ట్రేడ్​ యూనియన్​ గుర్తింపు సంఘ ఎన్నికలు 

On
సికింద్రాబాద్​ లో రైల్వే ట్రేడ్​ యూనియన్​ గుర్తింపు సంఘ ఎన్నికలు 

సికింద్రాబాద్​ లో రైల్వే ట్రేడ్​ యూనియన్​ గుర్తింపు సంఘ ఎన్నికలు 

సికింద్రాబాద్ డిసెంబర్​ 05 (ప్రజామంటలు): 

సికింద్రాబాద్ రైల్వే కోచింగ్ డిపోలో సౌత్ సెంట్రల్ రైల్వే ట్రేడ్ యూనియన్ గుర్తింపు సంఘ ఎన్నికల పోలింగ్​ గురువారం జరిగింది.పోలింగ్ సాయంత్రం  6 వరకు పోలింగ్ జరుగగా,ఐదు ట్రేడ్ యూనియన్లు పోటీలో ఉన్నాయి.

ఇందులో  ఎస్​సీఆర్ఈఎస్, ఎస్‌సీఆర్ఎంయూ సంఘాలు ప్రధానంగా గట్టి పోటీ నిస్తున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.

సంఘ జనరల్ సెక్రెటరీ మర్రి రాఘవయ్య పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. సౌత్​ సెంట్రల్​ రైల్వే పరిధి కింద మొత్తం 78434 ఉద్యోగ సిబ్బంది ఓటర్లు ఉన్నారు. సికింద్రాబాద్​ రైల్వే కోచింగ్​ డిపో పోలింగ్ కేంద్రంలో మొత్తం 917 ఓటర్లు ఉన్నారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈనెల 11న ఉంటుందని ఎన్నికల పరిశీలకులు తెలిపారు. కార్యక్రమంలో  ఎలక్ర్టికల్​ బ్రాంచీ సెక్రటరీ  విజయ్ కుమార్, వర్కింగ్ చైర్మన్​ జేఎల్​ ప్రకాష్, వైస్​ చైర్మన్​ ఎన్​.శ్రీకాంత్​, డివిజనల్​ ప్రెసిడెంట్ కొత్త మురళి​,డివిజన్​ సెక్రటరీ ప్రభురాజ్​, వైస్​ చైర్మన్​  ముస్తాక్ అలీ, అసిస్టెంట్ సెక్రటరీ , రెహమాన్​,మాధవ్, యూత్ కోఆర్డినేటర్​ డీఎన్​ రెడ్డి, జీ.రాజేశ్, జీపీ రమణ మూర్తి, నయిమ్​, నర్సింగ్​ రావు, ఆంజనేయులు, తిరుమలేశ్​, సత్యనారాయణ, ఎండీ షహీర్​ ​ పాల్గొన్నారు.
–––––
––––––

Tags