గోదావరి స్నానం... జన్మ రాహిత్యం  పూజ్య శ్రీ అతిథేశ్వరనంద స్వామి

నదుల పరిరక్షణ బాధ్యత అందరిదీ. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు 

On
గోదావరి స్నానం... జన్మ రాహిత్యం  పూజ్య శ్రీ అతిథేశ్వరనంద స్వామి

గోదావరి స్నానం-జన్మ రాహిత్యం
పూజ్య శ్రీ అతిథేశ్వరనంద స్వామి

 (రామ కిష్టయ్య సంగన భట్ల.9440595494)

 పరమ పవిత్ర గోదావరి నదీ స్నానం ద్వారా జన్మ రాహిత్యం పొంద వచ్చునని  పర్వత 
శ్రీ అద్వైత పీఠం, శ్రీలంక
విశ్వహిందూ మహాసంఘ్ భారత్, పూజ్య శ్రీ అతిథేశ్వరనంద స్వామి ఉద్ఘాటించారు. ధర్మపురి క్షేత్రంలో గోదావరి మహా హారతి కార్యక్రమాలలో శనివారం రాత్రి పాల్గొన్న స్వామీజీ అనుగ్రహ భాషణంలో... గోదావరి నదీలో ఒక్కొక్క మునక వల్ల స్వర్గానికి ఒక్కొక్క మెట్టు ఎక్కే ఫలం దక్కుతుందన్నారు. 
హిందూ ధర్మం సనాతన మైనదని, హిందూ దేశ సంస్కృతి నాగరికత ప్రాచీన మైనవన్నారు. నదీ పూజ సనాతన సంప్రదాయ ఆచారంగా వస్తున్నదన్నారు. ధర్మ రక్షణ, గో సంరక్షణ సంఘటిత శక్తి ద్వారానే సాధ్యం అన్నారు. ఆది శంకర భగవత్పాదుల మహా ముద్ర ప్రాశస్త్యాన్ని వివరించి, భక్తులచే ముద్ర పట్టించి శ్లోకాలను అనిపించారు.
అలరించిన నాట్య ప్రదర్శనలు 
 
జగిత్యాల మేధిని లలిత కళా నిలయం ద్వారా నాట్య సామ్రాట్
బొమ్మిడి నరేష్ కుమార్ శిక్షణలో నిర్వహించిన సాంప్రదాయ శాస్త్రీయ నాట్య ప్రదర్శనలు అలరించాయి

-----IMG_20241130_201456IMG_20241130_201456 

నదుల పరిరక్షణ బాధ్యత అందరిదీ.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు 

భారతీయ ప్రాచీన నాగరికతకు మూలా ధారాలైన జీవనదుల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వాలతో పాటు ప్రజలకు ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోల్సాని మురళీధర్ రావు అన్నారు. శని
వారం రాత్రి ధర్మపురి క్షేత్ర గోదావరి తీరాన నిర్వహించిన గోదావరి హారతి కార్యక్రమంలో వేదిక నుండి ఆయన మాట్లాడుతూ, గోదావరి రానున్న రోజులలో జీవనరేఖగా నిలువాలన్నదే తమ లక్ష్యమ న్నారు. గోదావరి మహా హారతి కొత్త పరంపరకు తెర లేపిందని, నదీ తీరాలలోనే నాగరికతలు విలసిల్లిన విషయాన్ని గుర్తుంచు కోవాలన్నారు. హారతిలో సంకల్పం, పవిత్రలు ఉన్నాయని, తద్వారా భవిష్యత్తులో అభివృద్ధి జరగగల దన్నారు. పీఠాధిపతుల ఆశీస్సులతో, భక్తుల సహకారంతో, ప్రజల భాగస్వామ్యంతో కాలుష్య రహిత గోదావరి పరిరక్షణకై అంకితం కాగలమన్నారు. ధర్మపురితో ప్రారంభించి పలు తీర్థాలలో హారతి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. నదిని పూజించాలని, భక్తి భావాలను పెంపొందించు కోవాలని కోరారు. రాబోయే రోజులలో అన్ని ప్రాంతాలలో ఏడాది పొడవునా హారతి ఇవ్వాలనేదే సంకల్పమన్నారు.
గోదావరికి మహా హారతి
కార్తీక మాస శని వారం పవిత్ర దినాన రాత్రి జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో గోదావరి నదికి మహా హారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రముఖ యాజ్ఞికులు పాలెపు భరత్ శర్మ ఆచార్యత్వంలో గుడ్ల సురేశ్, ఆదిత్య, హరీష్ వేదోక్త సాంప్రదాయ రీతిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం  శ్రీ అతిథేశ్వరనంద స్వామి
 సమక్షంలో, గోదావరి మహా హారతి ఉత్సవ సమితి వ్యవస్థాపక చైర్మన్, బీజేపీ జాతీయ నాయకులు మురళీధర్ రావు ఆధ్వర్యంలో  ఘనంగా నిర్వహించారు. వేలాది మంది సమక్షంలో మంత్రోచ్ఛారణల మధ్య నదీ పూజాదికాలలో పాల్గొన్నారు. అనంతరం భక్తి శ్రద్ధలతో హారతి సమర్పించారు. వీహెచ్పీ, ఆరెస్సెస్, స్వచ్చంద సంస్థల బాధ్యులు, గోదావరి హారతి నిర్వాహకులు వీరగోపాల్, రాంసుధాకర్, పిల్లి శ్రీనివాస్, రాష్ట్ర వి హెచ్ పి అద్యక్షులు సురేందర్ రెడ్డి,  లింగంపల్లి శంకర్, పాపారావు బలుగురి సంతోష్ రావు, రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, భక్తులు పాల్గొన్నారు. తెలంగాణ జీవనధార, దక్షిణ గంగానది గోదావరిని పరి రక్షించడానికి  గోదావరి యాత్ర పేరుతో కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామన్నారు. తెలంగాణలో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో యాత్ర సాగుతుందన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ శపథం చేయాలని కోరారు.
మహా హారతికి పోటెత్తిన భక్తులు
ధర్మపురి క్షేత్రంలోని గోదావరి తీరాన జరిగిన మహా హారతికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బీజేపీ జాతీయ నాయకులు  మురళీధర్రావు వరుసగా 13వ సంవత్సరం నిర్వహించిన ధర్మపురి గోదావరి మహా హారతి కార్యక్రమాలలో హారతి రాష్ట్ర కో కన్వీనర్ వీర గోపాల్, కోకన్వీనర్ రాంసుధాకర్, పిల్లి శ్రీనివాస్, కన్నం అంజయ్య, రాష్ట్ర వి హెచ్ పి అద్యక్షులు సురేందర్ రెడ్డి, వైకుంఠం, గంగారాం, లక్ష్మణ్, నర్సయ్య, సురేందర్, మురళి, మూర్తి, లవణ్, భాస్కర్, శరత్, కందాల మూర్తి, పాటు పలువురు వివిధ స్థాయిల నాయకులు వేదికపై ఉండగా, వందలాది మంది పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 
 బీజేపీ నేత మురళీధర్రావు పూజలు
ధర్మపురి క్షేత్రాన్ని బీజేపీ జాతీయ నేత  పోల్సాని మురళీధర్ రావు  సాయంత్రం సందర్శించారు. బీజేపీ రాష్ట్ర, జిల్లాల, మండల నేతలు తోడురాగా, దేవస్థానానికి వెళ్ళి, దైవ దర్శనాలు చేసుకుని, ప్రత్యేక పూజాదికాలలో పాల్గొన్నారు. అర్చకులు, సిబ్బంది స్వాగతం పలికారు. ఈఓ శ్రీనివాస్, శేష వస్త్రాలు సమర్పించి, ప్రసాదం అందజేసి ఆయనను సన్మానించారు. 
 పర్యావరణ పరిరక్షణే గోదావరి హారతి లక్ష్యం
గోదావరి రాష్ట్ర ఉత్సవ కమిటీ కో కన్వీనర్ వీరగోపాల్, రాష్ట్ర కో కన్వీనర్ రాంసుధాకర్రావు, జిల్లా కన్వీనర్ పిల్లి శ్రీనివాస్, ఈసందర్భంగా  మాట్లాడుతూ, సదరు కార్యక్రమాన్ని లోక కళ్యాణం, ధర్మాచరణ కోసం నిర్వహిస్తున్నామని, ఆర్థిక ప్రగతి దృష్ట్యా గోదావరి జలాలతో గ్రామీణ పేదరికాన్ని తొలగించడం, పర్యావరణ పరిరక్షణ కోణంలో గోదావరిని అపవిత్రం చేయకుండా జీవనదిగా ఉంచడం, సాంస్కృతికంగా మనకు గోదావరితో గల తరతరాల అనుబంధాన్ని పటిష్టం చేసుకోవడం, గోదావరి తీరాన వెలసిన అనేక దేవాలయాలను, స్నాన ఘట్టాలను పునరుద్ధరించడం ప్రధాన లక్ష్యమన్నారు.
Tags